Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అదనంగా 2 శాతం కరవు భత్యం/ కరవు సాయం చెల్లించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం; 2017 జనవరి నుండి చెల్లింపు


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డిఎ), అలాగే పెన్షనర్లకు కరవు సాయం (డిఆర్) అదనపు వాయిదా విడుదల చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2017 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తుంది. దీనిని ప్రస్తుతమున్న మూల వేతనం/పెన్షన్ లోని 2 శాతం రేటుకు మించి మరో 2 శాతం మేరకు పెంచడమైంది. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నిర్ణయించారు.

7వ కేంద్రీయ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ఆమోదించినటువంటి ఒక సూత్రానికి అనుగుణంగా ఈ పెరుగుదల ఉంది.

డియర్ నెస్ అలవెన్సు మరియు డియర్ నెస్ రిలీఫ్.. ఈ రెండింటి వల్ల ఖజానాపై పడే ఉమ్మడి భారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో (2017 జనవరి మొదలుకొని 2018 ఫిబ్రవరి మధ్య 14 నెలల కాలానికి) క్రమానుగతంగా రూ.5,857.28 కోట్లు మరియు రూ.6,833.50 కోట్లు గా ఉంటుంది.

దాదాపు 48.85 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 55.51 లక్షల మంది పెన్షనర్లు దీనివల్ల ప్రయోజనం పొందుతారు.

***