పిఎంఇండియా
అధిక ప్రభావశీలత కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ లో గీగా వాట్ (జిడబ్ల్యు) స్థాయి తయారీ సామర్థ్యాన్ని సాధించడం కోసం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశన్సి సోలర్ పివి మాడ్యూల్స్’ లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం (2వ విడత) ను 19,500 కోట్ల రూపాయల ఖర్చు తో అమలు చేసేందుకు నూతన మరియు నవీకరణయోగ్య శక్తి మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భారతదేశం లో అధిక ప్రభావశీలత్వం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ కి అనువైనటువంటి ఒక ఇకోసిస్టమ్ ను నిర్మించడం, దీని ద్వారా నవీకరణ యోగ్య శక్తి రంగం లో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశన్సి సోలర్ పివి మాడ్యూల్స్’ లక్ష్యం గా ఉంది. ఇది ఆత్మనిర్భర్ భఆరత్ కార్యక్రమాన్ని బలపరచడం తో పాటు గా ఉపాధి అవకాశాల ను కల్పిస్తుంది.
ఒక పారదర్శక ఎంపిక ప్రక్రియ మాధ్యమం ద్వారా సౌర ఫొటోవోల్టాయిక్ తయారీదారు సంస్థల ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ) ని సోలర్ పివి తయారీ ప్లాంటు లు పనిచేయించడం ప్రారంభం అయిన తరువాత 5 సంవత్సరాల కాలానికి గాను వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోత్సాహకాన్ని దేశీయ బజారు లో అధిక ప్రభావశీలత్వం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ అమ్మకాల ను బట్టి ఇవ్వడం జరుగుతుంది.
ఈ పథకం నుండి ఆశిస్తున్నటువంటి ఫలితాలు/లాభాలు ఈ కింది విధం గా ఉండగలవు:
***
Today's Cabinet decision on a PLI scheme relating to the National programme on High Efficiency Solar PV Modules will enhance manufacturing in the sector and boost investment. https://t.co/Xe1QXcfqW6
— Narendra Modi (@narendramodi) September 21, 2022