Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా ఆర్ధిక సంస్థ‌ల‌ సిఈవో ల‌తో ప్ర‌ధాన మంత్రి రౌండ్ టేబుల్ స‌మావేశం

అమెరికా ఆర్ధిక  సంస్థ‌ల‌ సిఈవో ల‌తో ప్ర‌ధాన మంత్రి రౌండ్ టేబుల్ స‌మావేశం

అమెరికా ఆర్ధిక  సంస్థ‌ల‌ సిఈవో ల‌తో ప్ర‌ధాన మంత్రి రౌండ్ టేబుల్ స‌మావేశం


అమెరికా కు చెందిన ప్ర‌ముఖ ఆర్ధిక సంస్థ‌ల‌కు చెందిన ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్ అధికారుల‌తో ( సీఈవో) భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ నేడు రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో- జె పి మోర్గాన్ సంస్థ జేమీ డైమ‌న్‌, బ్లాక్ స్టోన్ ఛైర్మ‌న్‌, సీఈవో-స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ స్వాజ్ మ‌న్‌, వార్ బ‌ర్గ్ పిక‌స్ స‌హ – సీఈవో ఛార్లెస్ కేయీ, కెకెఆర్ స‌హ ఛైర్మ‌న్‌ -స‌హ సీఈవో హెన్రీ క్రేవిస్‌, జ‌న‌ర‌ల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్‌, ఏఐజీ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్‌- సీఈవో హాంకాక్‌, టైగ‌ర్ గ్లోబ‌ల్ వ్య‌వ‌స్థాప‌కుడు – మేనేజింగ్ పార్ట్‌న‌ర్ ఛేజ్ కోల్ మ‌న్‌, న్యూయార్క్ స్టేట్ కామ‌న్ రిటైర్‌మెంట్ ఫండ్ ప్ర‌ధాన పెట్టుబ‌డి అధికారి వికీ పుల్ల‌ర్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. భార‌త్‌ లో వ్యాపార నిర్వ‌హ‌ణ‌ను సులభ‌త‌రం చేసేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా సీఈవోలు అభినందించారు. డిజిట‌ల్ ఇండియా తో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న అభివృద్ధి త‌దిత‌ర కీల‌క రంగాల‌లో ప్ర‌ధాని తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌శంసిస్తూ – భార‌త్ లో కొత్త కంపెనీ ( స్టార్ట‌ప్ ) ల‌లో, వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల స్టార్ట‌ప్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సీఈవోలు ఆస‌క్తి చూపారు. భార‌త్‌లో ప‌న్నుల విధానం, ఇత‌ర అధికారిక అనుమ‌తుల మాంజూరులో క‌లుగుతున్న‌ అవ‌రోధాలు- త‌దిత‌ర అంశాల‌ను కూడా సీఈవోలు ప్ర‌స్తావిస్తూ, ఇవి ఇప్ప‌టికీ కూడా ఆందోళ‌న క‌లిగించే అంశాలేన‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ -భార‌త్‌లోని వివిధ రంగాల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని సీఈవోల‌ను కోరారు. కీల‌క‌ రంగాలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని వివ‌రిస్తూ ` స్టార్ట‌ప్ ఇండియా – స్టాండ‌ప్ ఇండియా ` పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాల‌లోనే సంస్థ‌లు ఇప్పటి వ‌ర‌కు ఉండ‌గా- ఇక‌పై వ్య‌క్తిగ‌తంగా, పారిశ్రామికవేత్త‌లే కొత్త స్టార్ట‌ప్ కంపెనీల‌ను ` ప‌ర్స‌న‌ల్ సెక్టార్ ` లో నెల‌కొల్ప‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌ధాని నొక్కి చెప్పారు. విప్ల‌వాత్మ‌క‌మైన ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్ కంపెనీలు, వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు కేంద్ర బిందువుగా ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొన్న సీఈవోలు- పెట్టుబ‌డుల విష‌యంలో భార‌త్ కు ఉన్న అవ‌కాశాల‌కు సంబంధించిన అంశాల‌పై మాట్లాడ‌టమే కాకుండా, ఆ దేశంపై త‌మ‌కున్న అపార‌మైన విశ్వాసం వ్య‌క్తంచేయ‌డం ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మ అభిప్రాయాల‌తో పాటు త‌మ‌కున్న ఆందోళ‌న‌ల‌ను కూడా సీఈవోలు విస్ప‌ష్టంగా తెలియ‌చేశార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. గ‌త 15 నెల‌లుగా త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని, ఆర్ధిక ప‌రంగా సాధించిన విజ‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. గ‌త ప‌దిహ‌ను నెల‌ల కాలంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ( ఎఫ్‌డిఐ) గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వాతావ‌ర‌ణానికి ఇది భిన్నంగా ఉంద‌ని, దీనివ‌ల్ల భార‌త్ ప‌ట్ల పెట్టుబ‌డుదారుల విశ్వాసం పెరిగింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. వ్యాపారాన్ని సులువుగా నిర్వ‌హించేందుకు భార‌త్‌లో ఆర్ధిక వాతావ‌ర‌ణం మ‌రింత మెరుగవుతుంద‌న్న ప్ర‌పంచ బ్యాంకు అంచ‌నాల‌ను శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. వ్యాపారానికి సంబంధించి భార‌త్ లోని వివిధ రాఫ్ట్రాల మ‌ధ్య‌ ప్ర‌స్తుతం ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెల‌కొంద‌ని అన్నారు. ఎల్ పి జి స‌బ్సిదీ కోసం చేప‌ట్టిన ప్ర‌త్య‌క్ష ల‌బ్ది బ‌దిలీ ప‌థ‌కం – డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ( డిబిటి) ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప‌థ‌కంగా నిలిచింద‌ని ప్ర‌ధాని తెలిపారు. బీమా, రైల్వే, ర‌క్ష‌ణ రంగాల‌లో ఎఫ్‌డీఐ స‌ర‌ళీకృత విధానాల వ‌ల్ల పెట్టుబ‌డుల‌కు ఆస్కారం ఉంద‌ని అన్నారు. భార‌త్‌లో వ్య‌వ‌సాయం, ఆరోగ్య రంగాల‌లో బీమా ఉత్ప‌త్తుల వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ర‌క్ష‌ణ ఉత్ప‌త్తులు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, పున‌రుత్పాద‌క ఇంధ‌న సామాగ్రి , రైల్వే, మెట్రోలు, స్వ‌చ్ఛ్ భార‌త్‌, డిజిట‌ల్ ఇండియా త‌దిత‌ర రంగాల‌లో పెట్టుబ‌డుల‌కు ఆస్కారం ఉంద‌న్నారు.2022 వ సంవ‌త్స‌రంలోగా ఐదు కోట్ల గృహాల నిర్మాణం, ఆరు ల‌క్ష‌ల గ్రామాల‌కు బ్రాడ్ బ్యాండ్ అనుసంధాన‌త‌, రైల్వే సామ‌ర్ధ్యాన్ని రెట్టింపు చేయ‌డం, 175 గిగావాట్ల ఇంధ‌న పున‌రుత్ప‌త్తి వంటి నిర్దిష్ట‌

ప‌థ‌కాల‌ను త‌మ ప్ర‌భుత్వం నిర్దేశిత ల‌క్ష్యాలుగా పెట్టుకున్న‌ద‌ని , వీటిలో భారీ పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం క‌లిగింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.