Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో నికోల్ పాశిన్యాన్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని


అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నికోల్ పాశిన్యాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలియజేశారుమరోసారి దక్కిన ప్రజామోదం ఆయన నాయకత్వంపైదార్శనికతపై అర్మేనియా ప్రజలకు ఉన్న శాశ్వతమైన నమ్మకాన్నీవిశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు
భారత్అర్మేనియా మధ్య ఉన్న ఆత్మీయమైనచారిత్రక స్నేహ సంబంధాలనూసహకారాన్నీ మరింత బలోపేతం చేసేలా ఆయనతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘పార్లమెంటరీ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్టు పార్టీ అద్భుత విజయం సాధించినందుకు నికోల్ పాశిన్యాన్‌కు అభినందనలుమరోసారి దక్కిన ప్రజామోదం.. మీ నాయకత్వంపైదార్శనికతపై ఆర్మేనియా ప్రజలకున్న నమ్మకాన్నీవిశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుందిభారత్అర్మేనియా మధ్య ఉన్న ఆత్మీయమైనచారిత్రకమైన స్నేహ సంబంధాలనూసహకారాన్నీ మరింత బలోపేతం చేసేలా మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’ 

***