Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తో కలసి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కరవుపై, నీటి ఎద్దడి స్థితిపై సమీక్ష చేపట్టిన ప్రధాన మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తో కలసి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కరవుపై, నీటి ఎద్దడి స్థితిపై సమీక్ష చేపట్టిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కరవు మరియు నీటి ఎద్దడి స్థితి పై ఈ రోజు ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్ డి ఆర్ ఎఫ్) కింద రాష్ట్రానికి రూ.315.95 కోట్లు (స్టేట్ బ్యాలెన్సు ల ను సర్దుబాటు చేసిన అనంతరం) విడుదల అయ్యాయి. ఇది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్ డి ఆర్ ఎఫ్) లో కేంద్రం వాటాగా విడుదల చేసిన రూ.330 కోట్ల కు అదనం. మరొక రూ.173.25 కోట్లు 2016-17 సంవత్సరానికి గాను ఎస్ డి ఆర్ ఎఫ్ తొలి కిస్తీగా విడుదల అయ్యాయి.

దుర్భిక్ష పరిస్థితులను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలలో భాగంగా చెక్ డ్యాములను నిర్మించడం, ఎత్తి పోతల సేద్యపు నీటి పథకాలను పునరుద్ధరించడం, ఇంకా సంచార తుంపర్ల యూనిట్లను (రెయిన్ గన్స్) నియోగించడం వంటి చర్యలను రాష్ట్రం చేపట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం సాధించిన పురోగతిని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 2022 కల్లా 20 లక్షల హెక్టార్లను సూక్ష్మ సేద్య పద్ధతి పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రం లక్ష్యంగా నిర్దేశించుకొంది. ప్రపంచంలో ఉత్తమమైన పద్ధతులు, క్షేత్ర స్థాయి పరిశోధనలు చర్చకు వచ్చాయి. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం పెడుతున్న ప్రయాసను ప్రధాన మంత్రి అభినందిస్తూ మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మరియు గుజరాత్ లలో బిందు సేద్యం కారణంగా నీటి ఆదా, ఉత్పాదకత పెంపుదల, ఇంకా ఎరువులు, పురుగు మందులు మరియు కూలీల వంటి భిన్న పరామితులపై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని గురించి సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయవలసిందని ఆదేశించారు.

యూరియా కు వేప పూత పూసే దిశగా చర్యలు తీసుకోవాలన్న, ఇంకా మున్సిపల్ ఘన వ్యర్థాల నుండి తయారు చేసిన కంపోస్టు కు టన్నుకు రూ.1,500 వంతున సహాయం అందజేయాలన్న ప్రధాన మంత్రి చొరవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. భూ స్వస్థతను మెరుగుపరచడంలో, యూరియా దారి మళ్లడాన్ని అరికట్టడంలో ఈ చొరవలు ఎంతో ముఖ్యమైన పాత్రను నిర్వహించగలవని ఆయన అన్నారు.

వ్యవసాయ క్షేత్రం నుంచి నీటి వాడకం పైనా, సాగు పైనా రియల్-టైమ్ అప్ డేట్స్ ను పొందడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా వినియోగించుకొంటున్నదీ ముఖ్యమంత్రి సంక్షిప్తంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ విధమైన కొత్త పద్ధతులను అవలంబించడాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. పంట బీమా కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవచ్చో ఒక నమూనాను సిద్ధం చేసేందుకు రాష్ట్రం తో సంప్రదించి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా నీతి ఆయోగ్ కు ప్రధాన మంత్రి సూచించారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేయాలనే తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.