Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు


ఆచార్య వినోబా భావే జయంత్రి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

 

ఆచార్య వినోబా భావే ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ‘జై జగత్‌’ పిలుపు అన్ని హద్దులను దాటి, మానవత్వానికే అత్యున్నత స్థానం కల్పించిందని ప్రధానమంత్రి అన్నారు.

 

వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమం, సాధికారత కోసం ఆచార్య వినోబా భావే కృషి చేశారని శ్రీ మోదీ తెలిపారు.

 

సమానత్వం, గౌరవం, సేవ పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం సమాజంలో అత్యంత అణగారిన వర్గాలకు బలాన్ని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

“ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు.

 

ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ‘జై జగత్‌’ పిలుపు అన్ని హద్దులను దాటి, మానవత్వాన్ని అన్నింటికన్నా ఉన్నతంగా నిలిపింది.

 

వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమం, సాధికారత కోసం వినోబా భావే కృషి చేశారు.

 

సమానత్వం, గౌరవం, సేవ పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం సమాజంలో అత్యంత అణగారిన వర్గాలకు బలాన్ని అందించింది’’