Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్రికా లో అభివృద్ధి సంబంధిత స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు యుఎఇ కి మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ఆఫ్రికా లో అభివృద్ధి సంబంధిత స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఆఫ్రికా లో అభివృద్ధి కి సంబంధించిన భాగ‌స్వామ్య ప‌థ‌కాల ను మరియు కార్య‌క్ర‌మాల‌ ను అమ‌లు చేయ‌డం కోసం ఉభ‌య దేశాల మ‌ధ్య స‌హ‌కారాని కి సంబంధించిన ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను రూపొందించాలని ఈ ఎంఒయు నిర్దేశిస్తుంది.

ప్ర‌యోజ‌నాలు:

భార‌త‌దేశాని కి మ‌రియు ఆఫ్రికా దేశాల కు మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన, ఇంకా ఆర్థిక ప‌ర‌మైన బంధాల ను ప‌టిష్ట పరచడానికి, అలాగే మ‌న యొక్క స్థూల వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల‌ ను నెర‌వేర్చుకోవ‌డానికి కూడా ఈ ప్ర‌తిపాద‌న స‌హాయ‌కారి కానుంది.