Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్ భార‌త్ వ‌ల్ల అసమ్ లోని పేద రైతు ప్రాణాలు నిలచాయి


అస‌మ్ లో ఒక పేద వ‌రి రైతు ద్విజేన్ క‌లితా.  ఆయన వయస్సు 35 ఏళ్ళు.  ఆయన  త‌ల కు తీవ్ర‌మైన గాయం అయింది.  ఆయ‌న ను కామ‌రూప్ మెట్రో హాస్పిట‌ల్ లో చేర్చ‌గా, స్పృహ సగం త‌ప్పిన స్థితి లో ఆయన భరించలేనంత నొప్పి తో సతమతమవుతూ ఉన్నాడు.  విస్తృత స్థాయి లో ప‌రీక్ష‌లు చేసిన త‌రువాత ఆయ‌న కు స‌బ్‌ డ్యూర‌ల్ హిమెటోమా ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయింది.  దీనితో అత‌డి కి న్యూరో స‌ర్జ‌రీ, క్రేనియోప్లాస్టీ ల‌తో పాటు ఎక్సోజ‌న‌స్ గ్రాఫ్ట్ కూడా అవ‌స‌రపడింది.

 

http://164.100.117.97/WriteReadData/userfiles/image/image0012U0B.jpg

 

క‌లితా యొక్క ఆర్థిక ప‌రిస్థితి ని బ‌ట్టి చూస్తే ఈ రోగ చికిత్స ఖ‌ర్చుల‌ ను భ‌రించ‌డం అసాధ్యం అని ఆయన కుటుంబాని కి తోచింది. 

అయితేఆయ‌న కుటుంబాని కి ఆయుష్మాన్ భార‌త్‌-పిఎంజెఎవై ఒక‌టి ఉంది అన్న సంగ‌తి ని చెప్పిన మీద‌ట వారి లో ఒక ఆశ జ‌నించింది.  ఈ ప‌థ‌కం లో భాగం గా ఆయ‌న నిర్దేశిత రోగ చికిత్స ను ఉచితం గా పొంద‌డానికి వీలు ప‌డుతుంది అని వారితో చెప్పారు.

ఈ ప‌థ‌కం త‌న వంటి పేద ప్ర‌జ‌ల కు ఒక దీవెన వంటిది అని క‌లితా భావిస్తున్నారు.

 

http://164.100.117.97/WriteReadData/userfiles/image/image002G9UN.jpg

 ఈ రోజు న ఆయన ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి.  అంతేకాదు, ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌దైన‌టువంటి ఆరోగ్య ప‌థ‌కం యొక్క సాఫ‌ల్యాన్ని గురించి వివ‌రించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన 31 మంది ల‌బ్ధిదారుల లో కలితా కూడా ఒక‌రు గా ఉన్నారు. 

 

స‌రిగ్గా ఒక సంవ‌త్స‌రం క్రితం 2018 లో ప్రారంభించ‌బ‌డిన ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌పంచం లోనే అతి భారీ ఆరోగ్య బీమా ప‌థ‌కం గా ఉంది.  దేశం లోని 10.74 కోట్ల కు పైబ‌డిన పేద‌ల కు వైద్య సౌక‌ర్యాలు సుల‌భం గా అందుబాటు లోకి తీసుకురావాల‌నేదే ఈ ప‌థ‌కం ధ్యేయం గా ఉంది.

 

గ‌డ‌చిన సంవ‌త్స‌ర కాలం లో కలితా వంటి 50,000 మంది కి పైగా రోగులు వారి రాష్ట్రాని కి వెలుప‌ల ఆయుష్మాన్ భార‌త్ ద్వారా వైద్య సౌక‌ర్యాల ను పొందగలిగారు.     

 

ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న పిఎం-జెఎవై లో భాగం గా 16,085 ఆసుప‌త్రుల‌ ను పట్టిక లో చేర్చుకొని 41 ల‌క్ష‌ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌ కు చికిత్స ను అందించడమైంది. అలాగే 10 కోట్ల ఇ-కార్డుల ను జారీ చేయ‌డం జ‌రిగింది.

 

దేశం అంతటా ఆయుష్మాన్ భార‌త్ లో భాగం గా 20,700 కన్నా అధికంగా హెల్త్ ఎండ్ వెల్ నెస్ సెంట‌ర్ లను ప్రారంభించడమైంది.

 

మరిన్ని వివ‌రాలను తెలుసుకోవాలంటే ఈ క్రింద క్లిక్ చేయ‌గ‌ల‌రు

 

**