Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


పవిత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ఈ పవిత్రమైన రోజు అందిస్తుందని ఆయన అన్నారు.

భగవాన్ విఠలుని ఆశీస్సులు సంతోషాన్నిసామరస్యాన్నిఐశ్వర్యాన్ని ప్రసాదించిసమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని శ్రీ మోదీ ప్రార్థించారు. ప్రజల సంక్షేమంగౌరవం కోసం నిరంతరం సేవ చేయాలనే, శ్రమించాలనే మన సంకల్పానికి మరింత శక్తిని ఆయన అందిస్తారని ప్రధానమంత్రి ఆకాక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘పవిత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర దినం భక్తి, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ఇస్తుంది. భగవాన్ విఠలుని ఆశీస్సులు సంతోషాన్ని, సామరస్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించి, మెరుగైన సమాజం దిశగా మనల్ని నడింపించాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి సంక్షేమం, గౌరవం కోసం నిరంతరం సేవ చేయాలనే, శ్రమించాలనే మన సంకల్పాన్ని ఆయన మరింత శక్తిమంతం చేయాలని ప్రార్థిస్తున్నాను.’’ 

 

***