పిఎంఇండియా
పవిత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ఈ పవిత్రమైన రోజు అందిస్తుందని ఆయన అన్నారు.
భగవాన్ విఠలుని ఆశీస్సులు సంతోషాన్ని, సామరస్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించి, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని శ్రీ మోదీ ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, గౌరవం కోసం నిరంతరం సేవ చేయాలనే, శ్రమించాలనే మన సంకల్పానికి మరింత శక్తిని ఆయన అందిస్తారని ప్రధానమంత్రి ఆకాక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పవిత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర దినం భక్తి, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ఇస్తుంది. భగవాన్ విఠలుని ఆశీస్సులు సంతోషాన్ని, సామరస్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించి, మెరుగైన సమాజం దిశగా మనల్ని నడింపించాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి సంక్షేమం, గౌరవం కోసం నిరంతరం సేవ చేయాలనే, శ్రమించాలనే మన సంకల్పాన్ని ఆయన మరింత శక్తిమంతం చేయాలని ప్రార్థిస్తున్నాను.’’
***
Greetings on the sacred occasion of Ashadhi Ekadashi. This auspicious day is about the eternal message of devotion and compassion. May Bhagwan Vitthal’s blessings bring joy, harmony and prosperity and guide us towards a better society. May He strengthen our resolve to serve and…
— Narendra Modi (@narendramodi) July 25, 2026
आषाढी एकादशीच्या पवित्र पर्वानिमित्त हार्दिक शुभेच्छा. हा मंगलमय दिवस भक्ती, करुणा आणि सामाजिक सलोख्याचा चिरंतन संदेश देणारा आहे. भगवान विठ्ठलाचे आशीर्वाद आपल्या सर्वांच्या आयुष्यात आनंद, सलोखा आणि समृद्धी घेऊन येवो, हीच कामना. समाजातील प्रत्येक व्यक्तीच्या कल्याणासाठी आणि…
— Narendra Modi (@narendramodi) July 25, 2026