Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియాటిక్ సింహాల సంరక్షణలో భారత్ అద్భుత పునరాగమనం.. ఓ ప్రత్యేక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


భారత్‌కు చెందిన ఆసియా సింహాల సంఖ్య వృద్ధి చెందడంపై కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేడు ప్రజలతో పంచుకున్నారుఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందనివాటి ఆవాస ప్రాంతంసంచరించే పరిధి కూడా విస్తరిస్తుస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారువన్యప్రాణి సంరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న పటిష్టమైన నిబద్ధతదానికి తోడైన ప్రజల భాగస్వామ్యం కలిసి వన్యప్రాణులను కాపాడటంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచాయన్నారు.. రాబోయే తరాల కోసం ఈ జీవజాతులను పరిరక్షించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

ఇదొక అద్భుతందేశంలో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందివాటి ఆవాస ప్రాంతంసంచరించే పరిధి కూడా విస్తరిస్తోంది.

 

ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతమన వన్యప్రాణులను రక్షించిభావితరాల కోసం ఈ జాతిని సంరక్షించడానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది.

కేంద్రమంత్రి శ్రీ భూపేందర్‌ యాదవ్‌ రాసిన ఈ వ్యాసాన్ని చదవండి.

 

 

***

MJPS/SS/VJ