పిఎంఇండియా
ఆసియా క్రీడల జావెలిన్ త్రోలో పతకాలు సాధించిన ఇద్దరు భారతీయ క్రీడాకారులను ప్రధానమంత్రి అభినందించారు. వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించిన యశ్వీర్ సింగ్, కాంస్య పతకం సాధించిన రోహిత్ యాదవ్‌లను ప్రధానమంత్రి అభినందించారు.
ఈ విజయం ఆ ఇద్దరు క్రీడాకారులతో పాటు భారత అథ్లెటిక్స్ రంగానికి కూడా ఎంతో ఘనత అనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు చేపట్టే ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“ఆసియా క్రీడల వేదికపై ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో క్రీడాకారులు! వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించిన యశ్వీర్ సింగ్‌కు, కాంస్య పతకం సాధించిన రోహిత్ యాదవ్‌కు అభినందనలు. ఇద్దరు క్రీడాకారులతో పాటు భారత క్రీడా రంగానికి కూడా ఇది ఎంతో గొప్ప ఫలితం. భవిష్యత్తులో వారు చేపట్టే ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని నా ఆకాంక్ష.” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొంది.
****
Two Indian javelin throwers on the Asian Games podium!
— PMO India (@PMOIndia) September 28, 2026
Congratulations to Yashvir Singh on winning the Silver with a personal best and to Rohit Yadav on bringing home the Bronze.
A wonderful result for both athletes and for Indian athletics. Best wishes to them for the… pic.twitter.com/f1Z1fruWFc