పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల స్కిఫ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన హర్షిత తోమర్, శీతల్ వర్మలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
దృఢ సంకల్పం, నిలకడైన ప్రదర్శనతో వారు భారత్కు పతకాన్ని సాధించిపెట్టడమే కాకుండా.. గత ప్రదర్శన కంటే మెరుగైన ఫలితాన్ని నమోదు చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
హర్షితా తోమర్, శీతల్ వర్మల భవిష్యత్తు ప్రయత్నాలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
“ఆసియా క్రీడల్లో మహిళల స్కిఫ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన హర్షిత తోమర్, శీతల్ వర్మలకు అభినందనలు. దృఢ సంకల్పం, నిలకడైన ప్రదర్శనతో వారు భారత్కు పతకాన్ని సాధించిపెట్టడంతోపాటు.. గత ప్రదర్శనను కూడా మెరుగుపరిచారు. వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
Congratulations to Harshita Tomar and Shital Verma on winning the Bronze Medal in the Women’s Skiff event at the Asian Games! With determination and consistency, they have taken India onto the podium and also bettered the previous performance. Best wishes to them for their future…
— PMO India (@PMOIndia) October 2, 2026