Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో రజత పతకం సాధించిన అనాహత్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల్లో మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో రజత పతకం సాధించిన అనాహత్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో ఆమె అద్భుతమైన ప్రతిభను కనబరిచిందని కొనియాడారు.

అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడిన సమయంలోనూ అసాధారణ నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శించిందని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తులో అనాహత్ సింగ్ మరింతగా రాణించాలని, దేశానికి మరింత కీర్తి సంపాదించిపెట్టాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“
అనాహత్ సింగ్ రజతం సాధించటం అద్భుతం! ఆసియా క్రీడల్లో మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. భవిష్యత్తులో ఆమె మరింతగా రాణించాలని, భారతదేశానికి ఎన్నో విజయాలను అందించాలని ఆశిస్తున్నా: పీఎం శ్రీ నరేంద్ర మోదీ“.