పిఎంఇండియా
ఆసియా క్రీడల ఫైనల్లో ఘనవిజయం సాధించి, స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో వరసగా స్వర్ణ పతకాలను గెలుచుకోవడం… మొత్తంగా అయిదో స్వర్ణాన్ని సాధించడం అసాధారణమైన ప్రదర్శన అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఒకే ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం వల్ల ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఆసియా వేదికపై భారత హాకీ సగర్వంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
భారతీయ హాకీకి 2026 ఆసియా క్రీడలు నిజంగా ఎంతో ప్రత్యేకమైనవి!
ఫైనల్లో ఘనవిజయం సాధించి, ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న మన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. వరసగా రెండుసార్లు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు సాధించడం, మొత్తంగా అయిదో స్వర్ణాన్ని గెలుచుకోవడం ద్వారా మన క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ఒకే ఆసియా క్రీడల్లో మన పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం వల్ల ఈ విజయం మరింత ప్రత్యేకమైనది. ఆసియా వేదికపై భారత హాకీ సగర్వంగా నిలిచిందనడంలో సందేహం లేదు “