Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది భారతీయ క్రికెట్‌కు లభించిన గొప్ప విజయంగా ఆయన వర్ణించారు.

ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, చక్కని టీంవర్క్‌తో కూడిన గొప్ప ఆటను ఈ క్రీడల్లో చూడగలిగామని ప్రధానమంత్రి అన్నారు. ఈ గెలుపుతో తాజా ఏషియన్ గేమ్స్‌లో భారత్‌ మొదటి స్వర్ణపతకాన్ని చేజిక్కించుకొందని ఆయన తెలిపారు. జట్టు దేశానికి ఆనందాన్ని కలిగించిందనీ, ఇది దేశవ్యాప్తంగా అసంఖ్యాక యువ క్రికెటర్లకు స్ఫూర్తిని అందిస్తుందనీ ఆయన అన్నారు. జట్టులోని వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘భారతీయ క్రికెట్‌కు గొప్ప విజయం.

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన మన మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఇది ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, టీంవర్క్‌ ఉట్టిపడుతున్న శ్రేష్ఠ ప్రదర్శన.

ఈ గెలుపుతో భారత్ ఈ ఆటల పోటీలో తొలి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకొంది. దేశ ప్రజలంతా ఆనందించేటట్లు చేసింది ఈ జట్టు. దేశం నలుమూలలా అసంఖ్యాక యువ క్రికెటర్లకు ఈ గెలుపు స్ఫూర్తిని అందిస్తుంది.

జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.

 

***