పిఎంఇండియా
ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న ప్రాచీ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఆమె తన అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిపెట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ తన శుభాకాంక్షలను తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం గెలుచుకున్న ప్రాచీ చౌదరికి అభినందనలు. ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వేదికపై చిరస్మరణీయ స్థానం లభించింది. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.”