Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్పుట్’లో రజతం సాధించిన సోమన్ రాణాకు ప్రధాని అభినందన


   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్‌పుట్‌ ఎఫ్‌-56/57’లో రజత పతకం సాధించిన సోమన్‌ రాణాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్‌పుట్ ఎఫ్‌-56/57’లో సోమన్ రాణా అద్భుతంగా రాణించి రజత పతకం సాధించడం మనందరికీ గర్వకారణం. అతని అద్భుత ప్రతిభ, దీక్ష మనందరికీ స్ఫూర్తిదాయకం. అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.