Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతక విజేత శ్రీ అనుభవ్ చౌధరీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల 100 మీటర్ల టీ35 పోటీలో మెరుగైన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ అనుభవ్ చౌధరీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఈ గెలుపుతో అనుభవ్ చౌధరీ పాల్గొన్న మొదటి ఆటల పోటీల్లో గుర్తుపెట్టుకోదగ్గ ప్రయత్నాన్ని చేశారనీ, ఆయన క్రీడాయాత్రలో ప్రభావశీల శుభారంభాన్ని చాటిన అత్యుత్తమ వ్యక్తిగత ఆటతీరును కనబరిచారనీ ప్రధానమంత్రి అన్నారు. ఈ విజయానికిగాను శ్రీ అనుభవ్ చౌధరీకి ప్రధానమంత్రి అభినందనలను తెలియజేస్తూ, ఆయన క్రీడాజీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘శ్రీ అనుభవ్ చౌధరీ ఆసియా పారా గేమ్స్ ప్రయాణాన్ని ప్రభావవంతంగా ఆరంభించారు. ఆయన పురుషుల 100 మీటర్ల టీ35 పోటీలో మెరుగైన ఆటతీరును కనబరిచి, కాంస్య పతకాన్ని గెలిచారు. ఈ శ్రేష్ఠ విజయాన్ని సాధించినందుకు ఆయనకు ఇవే అభినందనలు. ఆయన క్రీడాజీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తారని ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

 

***