Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత రత్న శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య ను కూడా ఆయన గుర్తు తెచ్చుకొన్నారు. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతిని భారతదేశంలో ఇంజినీర్స్ డే గా పాటిస్తున్నారు.

“ఇంజినీర్స్ డే నాడు ఇంజినీర్లు అందరికీ ఇవే నా శుభ కామనలు. ఇంజినీర్ల ప్రతిభ, అంకిత భావం మరియు జిజ్ఞాస నవీన కల్పనలకు ఎన్నింటికో బాట వేసింది.

భారత రత్న శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి ని పురస్కరించుకొని ఆయనకు గర్వంతోను, ఆనందంతోను ప్రణమిల్లుదాము. పథనిర్ణేత ఇంజినీర్ గా ఆయన స్మరణీయుడే కాక మాన్యుడు కూడా” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.