పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమవేశం, ఆరోగ్యసంరక్షణ, వెల్‌నెస్ రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి 2018 అక్టోబర్ 29న కుదిరిన అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీనుంచి అమలులోకివచ్చే విధంగా ఆమోదం తెలిపారు.
సహకార అవగాహనా ఒప్పందంలో కింది అంశాలు ఉన్నాయి.
ఎ) ప్రత్యేక ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం,
1) అత్యవసర వైద్య సేవలు, సర్జరీ, ట్రామాకేర్ , ప్రతి రంగంలో కొత్త సామర్ధ్యాలు సమకూర్చుకోవడం,
2)క్లినికల్ పరీక్షలకు సంబంధించి అధునాతన సంయుక్త పరీక్షా లేబరెటరీల ఏర్పాటు
3)ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన శిక్షణార్థులకు జపాన్ భాషా బోధన కేంద్రం ఏర్పాటు
4)ఇరుదేశాలలో ఎయుఎంఎస్ వంటి టెరిటరీ కేర్ సెంటర్ల మధ్యకొలాబరేషన్ , మరియు
5. వయోధికుల సంరక్షణకు సంబంధించి సంరక్షణ కార్యకర్తలకు సాంకేతిక శిక్షణకు ప్రీ లెక్చర్లు అందించడానికి ఆయా సంస్థలకు మద్దతు నివ్వడం, జపాన్ నుంచి సర్టిఫికేటెడ్ కేర్ వర్కర్లను పంపడం, శిక్షణ పొందిన సంరక్షణ అందిచ్చే వారిని జపాన్‌కు అందించడానికి, పాఠ్యపుస్తకాలను, పాఠ్యప్రణాళికను సమకూర్చడం.
బి) మౌలిక సదుపాయాల అభివృద్ధి:
1)సెంట్రలైజ్‌డ్ మేనేజ్‌మెంట్ హెల్త్‌కేర్ పంపిణీ కేంద్రం ఏర్పాటు
2)పరిశుభ్రమైన టాయిలెట్‌లు అందుబాటులో ఉంచడం ద్వారా శౌచాలయ పరిశుభ్రతను మెరుగుపరచడం, ఆన్‌సైట్ ప్రాసెసింగ్ వంటి ఏర్పాట్లు,
3) పేషెంట్ డాటా అనాలసిస్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మెడిసిన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై సంస్థాగత కొలాబరేషన్‌కు ప్రోత్సాహం,
4) ఇండియాలొ ఇండియా- జపాన్ ఇన్నొవేషన్ హబ్
5) ఇండియాలో మొబైల్ బి.ఎస్.ఎల్ 3 ల్యాబ్ సౌకర్యాలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు
6)మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద తయారీ కర్మాగారాలపై ప్రత్యేక దృష్టిపెడుతూ, అత్యున్నత విలువగల వైద్య పరికరాలు, పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నస్టిక్స్‌ల విషయంలో పరస్పర సహకారం
సి) మానవ వనరుల అభివృద్ధి:
1) ఎం.ఇ- బి.వై.ఒ , ఆయుర్వేద వంటి ఆరోగ్య స్వీయ నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టు ప్రమోషన్,రిసెర్చ్, మానవ వనరుల అభివృద్ధికి చర్యలు
2) ఇండియా, జపాన్ పబ్లిక్, ప్రైవేట్ హెల్త్‌కేర్ ఫోరమ్ ఏర్పాటు
డి) ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు, ఎ.హెచ్.డబ్ల్యు.ఎం వంటి పరస్పరం నిర్ణయించుకునే ఇతర అంశాల విషయంలో సమన్వయం సాధించేందుకు చర్యలు
ఇ) ఎం.ఒ.సిలో పేర్కొన్న అంశాల విషయంలో పరస్పరం సహకారానికి ప్రోత్సాహం. సహకారానికి సంబంధించిన వివరాలను మరింత వివరించేందుకు ఉన్నత స్థాయి సంప్రదింపుల యంత్రాంగాన్ని సంయుక్త కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సహకార అవగాహనా ఒప్పందం అమలను పర్యవేక్షిస్తుంది.
*****