పిఎంఇండియా
శ్రీ వెంకయ్య నాయుడు రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. శ్రీ మోదీ సారథ్యంలో భారతదేశ అభివృద్ధి ప్రస్థానం… ఆలోచనా ధోరణిలో వచ్చిన గణనీయమైన మార్పునకు నిదర్శనంగా ఎలా నిలుస్తుందో ఈ వ్యాసంలో వివరించారు. ‘‘చల్తా హై’’ అనే సాధారణ ఆలోచనా విధానం నుంచి మార్పు సాధ్యమే అని బలంగా విశ్వసించే ‘‘బదల్ సక్తా హై’’ స్ఫూర్తి దిశగా ఈ ప్రయాణం సాగిందన్నారు.
పరిపాలన, అభివృద్ధిలోని అనేక రంగాల్లో ఈ మార్పు ప్రతిబింబిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లను స్థిరంగా, దృఢంగా కొనసాగిస్తున్న చర్యల ద్వారా పరిష్కరించే సామర్థ్యాన్ని బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపులు, పేదరికం తగ్గింపు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ప్రదర్శిస్తున్నాయి.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘చల్తా హై’’ ధోరణి నుంచి ‘‘బదల్ సక్తా హై’’ అనే దృక్పథం దిశగా భారత్ మారేందుకు పీఎం నరేంద్ర మోదీ ప్రయాణం దోహదపడిందీ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు రాశారు. బ్యాంకింగ్ సంస్కరణల నుంచి డిజిటల్ చెల్లింపులు, పేదరిక నిర్మూలన వరకు, ఒకప్పుడు అధిగమించడం కష్టమని భావించిన సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నాం.
వికసిత్ భారత్ దిశగా భారత దేశ ప్రయాణాన్ని తీర్చిదిద్దుతున్న ఆలోచనా విధానం గురించి కచ్చితంగా చదవాల్సిన వ్యాసం’’.
PM @narendramodi's journey has helped shift India from a "chalta hai" attitude to a "badal sakta hai" mindset, writes former Vice President Shri @MVenkaiahNaidu. From banking reforms to digital payments and poverty reduction, challenges once seen as difficult to overcome have been tackled with determination. A must-read on the mindset shaping India's journey towards Viksit Bharat. https://t.co/0jhFwKs7JW
— PMO India (@PMOIndia) October 7, 2026