Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు, ద ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం


ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ ఆర్ డి ఎ ఐ)కు మరియు ద ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ ఒ యు కు) కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై 2016 ఫిబ్రవరిలో సంతకాలు జరిగాయి.

బీమా రంగానికి చెందిన చానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వంటి వాటిలో సహకారం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను అందించడం ద్వారా ఈ రంగాన్ని పర్యవేక్షించడంలో ఇరు పక్షాల అధికార యంత్రాంగాల మధ్య ఇతోధిక సమన్వయానికి ఈ ఎమ్ ఒ యు వీలు కల్పిస్తుంది. అంతే కాకుండా ఉభయ దేశాలలోను చట్టాలను, నిబంధనలను అమలులోకి తేవడానికి గాని, లేదా వాటి ఆచరణను పర్యవేక్షించడానికి గాని గోప్య సమాచారంతో పాటు ఇతరత్రా నియంత్రణపూర్వక మరియు పర్యవేక్షణ సంబంధిత సమాచారాన్ని సైతం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి కూడా ఈ ఎమ్ ఒ యు దోహదం చేస్తుంది.

***