Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి


ప్రాంతీయ పరిణామాలుద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు.

ఈద్, నౌరుజ్ పర్వదినాల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఈ పండగ సీజన్ పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిస్థిరత్వంసుసంపన్నతను తీసుకువస్తుందని ఇరువురు నేతలు ఆకాంక్షించారుప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ.. ప్రపంచ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించేలా మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారుసముద్రయాన స్వేచ్ఛను కాపాడటంఅంతర్జాతీయ రవాణా మార్గాల్లో భద్రత ఉండేలాఅంతరాయం లేకుండా చూడటం కీలకమని స్పష్టం చేశారుఇరాన్‌లో ఉన్న భారత పౌరుల రక్షణభద్రత పట్ల ఆ దేశ మద్దతుకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఈద్నౌరుజ్ పర్వదినాల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో మాట్లాడిశుభాకాంక్షలు తెలిపానుఈ పండగ సీజన్ పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిస్థిరత్వంసుసంపన్నత కలగాలని ఆశిస్తున్నాం.

ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ.. ప్రపంచ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించేలా మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించాం.

సముద్రయాన స్వేచ్ఛను కాపాడటం, అంతర్జాతీయ రవాణా మార్గాల్లో భద్రత ఉండేలాఅంతరాయం లేకుండా చూడటం కీలకమని స్పష్టం చేశాం.

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతరక్షణకు ఆ దేశ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి అభినందనలు“.