Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇస్తాంబుల్ లో జరిగిన ఉగ్ర‌వాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి


భార‌తదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట‌ర్కీలోని ఇస్తాంబుల్ లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిని ఖండించారు.

“ఇస్తాంబుల్ లో జరిగిన దాడి అమానుషమైందీ, భీతిగొలిపేదీనూ. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***