Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇ-గ‌వ‌ర్నెన్స్ రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం భార‌త‌దేశాని కి మరియు ఉజ్‌ బెకిస్తాన్ కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిర‌వ్గం.


ఇ-గ‌వ‌ర్నెన్స్ రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం భార‌త‌దేశాని కి మరియు ఉజ్‌ బెకిస్తాన్ కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద పత్రాని కి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఇ-గ‌వ‌ర్నెన్స్, ఐటి విద్య, వివిధ రంగాల లో ఇ-గ‌వ‌ర్నెన్స్ కు అనుకూలమైనటువంటి ఉత్ప‌త్తుల ను/ ఉప‌క‌రణాల ను ప్ర‌వేశ‌ పెట్టడం మరియు అమలుపరచడం, డేటా సెంట‌ర్ ల అభివృద్ధి వంటి రంగాల లో స‌న్నిహితంగా స‌హ‌కరించుకోవడాన్ని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించినటువంటిదే ఈ యొక్క ఒప్పందం.

పూర్వ‌రంగం :

ఇ న్ ఫర్ మేశన్ క‌మ్యూనికేశ‌న్స్ టెక్నాల‌జీ (ఐసిటి) సంబంధ ప్ర‌వ‌ర్ధ‌మాన క్షేత్రాల లో అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ ఫ్రేం వర్క్ ల పరిధి లో ప్రోత్స‌హించ‌వ‌ల‌సిందంటూ ఇలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ కు సూచించ‌డం జ‌రిగింది. దీని కి అనుగుణం గానే గుర్తించిన రంగాల లో వివిధ దేశాల తోను, వివిధ దేశాల కు చెందిన ఏజెన్సీ ల‌తోను ఆ మంత్రిత్వ శాఖ ఒప్పందాల ను కుదుర్చుకొంది.