Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి పై బాధను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈశాన్య భారతంలోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితి పై వ్యథను వ్యక్తం చేశారు.

‘‘ఈశాన్య భారతంలో వేరు వేరు ప్రాంతాలలో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితికి నేను వ్యథకు లోనయ్యాను.

వరదల బారిన పడ్డ ప్రజల బాధలో నేను కూడా పాలు పంచుకొంటున్నాను.

యావద్దేశ ప్రజలు ఈ సమయంలో ఈశాన్య ప్రాంత ప్రజల వెన్నంటి నిలుస్తారు. పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొని రావడానికి సాధ్యమైన అన్ని రకాలుగాను కేంద్రం సహాయం చేస్తుంది.

నేను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ తోను, ఢిల్లీ, ఇంకా రాష్ట్రాల లోని అధికారుల తోను వరదలపై మాట్లాడాను.

రక్షణ, సహాయక కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించవలసిందిగాను, అవసరమైన వారికి అన్ని విధాల సహాయం అందేటట్లు చూడవలసిందిగాను నా సహచరుడు శ్రీ కిరణ్ రిజిజు ను కోరాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***