Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయంలో అర్చనలలో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి; పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరాఖండ్ లో పర్యటించారు. ఆయన కేదార్ నాథ్ దేవాలయంలో అర్చనలలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఆ తరువాత హరిద్వార్ జిల్లా లోని పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించారు. ఇన్ స్టిట్యూట్ లోని డ్రగ్ డిస్కవరీ అండ్ రిసర్చ్ లేబరేటరీలో ఆయన కొద్దిసేపు కలియదిరిగారు. ఈ సందర్భంగా స్వామి రామ్ దేవ్ మరియు ఆచార్య బాలకృష్ణలు ప్రధాన మంత్రి వెంట ఉన్నారు.

ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, చారిత్రకంగా మనకు గర్వకారణమైనటువంటి వారసత్వాన్ని మనం అలక్ష్యం చేయడం గాని లేదా మరచిపోవడం గాని చేయబోమన్న ధీమాను వ్యక్తం చేశారు. మన పూర్వులు అందించిన నూతన ఆవిష్కారాల స్ఫూర్తిని మనం సజీవంగా అట్టిపెట్టుకొని తీరాలని కూడా ఆయన అన్నారు.

అంతర్జాతీయ యోగా దినాన్ని జరుపుకొనేటప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకొనిరావాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. స్వస్థతకు సంబంధించిన వివిధ అంశాలతో కూడిన నూతన ఆరోగ్య విధానాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. వ్యాధులు రాకుండా పాటించవలసిన ఆరోగ్య సంరక్షణ సంబంధిత అతి ప్రధానమైన అంశాలలో స్వచ్ఛత ఒక అంశం అని ప్రధాన మంత్రి చెప్పారు.

వరల్డ్ హెర్బల్ ఎన్ సైక్లోపీడియ ఒకటవ సంపుటిని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

***