Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉన్న‌త విద్య రంగంలో భార‌త్‌, కెన‌డాల మ‌ధ్య ఎంఓయూ పున‌రుద్ధ‌ర‌ణ‌


ఉన్న‌త విద్య రంగంలో భార‌త్‌, కెన‌డాల మ‌ధ్య స‌హ‌కారం అంశంపై ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఓయూ)ను పున‌రుద్ధ‌రించుకోవ‌డానికి కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఉన్న‌త విద్య రంగంలో భార‌త్‌, కెన‌డాల మ‌ధ్య ఇప్ప‌టికే ఉన్న భాగ‌స్వామ్యాల‌ను మ‌రింత ప‌క్కాగా అమ‌లుచేయ‌డానికి ఈ ఎంఓయూ తోడ్ప‌డ‌నుంది.

నేప‌థ్యం:

ఉన్న‌త విద్య రంగంలో భార‌త్‌, కెన‌డాల మ‌ధ్య స‌హ‌కారం అంశంపై 2010 జూన్ లో ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఓయూ) పై సంత‌కాలు జ‌రిగాయి. ఈ ఎంఓయూ కాల ప‌రిమితి ఐదేళ్ళు. ఎంఓయూ లో పేర్కొన్న ప్ర‌కారం ఐదేళ్ళు పూర్త‌యిన త‌ర్వాత మ‌రో ఐదేళ్ళ‌పాటు దీనిని పున‌రుద్ధ‌రించుకోవాల‌ని నియ‌మం పెట్టుకున్నారు. భార‌త్ – కెన‌డాల‌లో ఉన్నత విద్యాసంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వయానికి అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని గుర్తించి, ఉన్న‌త విద్య – ప‌రిశోధ‌న రంగంలో ద్వైపాక్షిక సంబంధాల‌ను ముమ్మ‌రం చేసుకోవ‌డానికి ఈ ఎంఓయూ ను పున‌రుద్ధ‌రించాల‌ని ప్ర‌తిపాదించారు.