పిఎంఇండియా
ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను పశ్చిమ బంగాల్ లోని హుగ్‌లీ లో గల ఆరామ్‌బాగ్ లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం ఇవ్వడంతో పాటు గా శంకుస్థాపన ను జరిపారు. ఈ రోజు న ప్రారంభించుకొంటున్న అభివృద్ధి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల లో రైలు, నౌకాశ్రయాలు, చమురు సరఫరా కు ఉద్దేశించిన గొట్టపు మార్గం, ఎల్‌పిజి సరఫరా మరియు వ్యర్థ జలాల శుద్ధి వంటి రంగాల కు సంబంధించినవి ఉన్నాయి.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం లో శరవేగం గా వృద్ధి చోటుచేసుకొంటోందని, 2047 వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశం గా తీర్చిదిద్దాలి అనేది సంకల్పమని పేర్కొన్నారు. ఆయన యువతీ యువకుల, మహిళల, రైతుల మరియు పేదల సశక్తీకరణ కు సంబంధించిన ప్రాధాన్యాల ను పునరుద్ఘాటించారు. ‘‘మేం పేదల సంక్షేమం కోసం సదా పాటుపడుతూ వచ్చాం, మరి ఈ కృషి తాలూకు ఫలితాలు ప్రస్తుతం ప్రపంచం కళ్ళెదుట కనిపిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు. పేదరికం వలయం లో నుండి 25 కోట్ల మంది ప్రజానీకం బయటకు వచ్చారన్న వాస్తవం ప్రభుత్వ నిర్ణయాల విధానాల యొక్క మరియు ప్రభుత్వం పయనిస్తున్న దిశ యొక్క సప్రమాణికత ను సూచిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. దీనికి అంతటికి వెనుక ఉన్న ప్రధానమైన కారణం సరి అయినటువంటి ఉద్దేశ్యాలే అని ఆయన అన్నారు.
పశ్చిమ బంగాల్ అభివృద్ధి కి తోడ్పాటును అందించే 7,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరిగింది; ఈ ప్రాజెక్టుల లో రైలు, నౌకాశ్రయాలు, పెట్రోలియమ్, ఇంకా జలశక్తి ల వంటి రంగాల కు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘దేశం లోని ఇతర ప్రాంతాల లో మాదిరిగానే పశ్చిమ బంగాల్ లో కూడాను రైలు మార్గాల ఆధునికీకరణ ను అంతే వేగం గా చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఝార్‌గ్రామ్ -సాల్‌గాఝారీ ని కలిపే మూడో రైలు మార్గం గురించి ఆయన ప్రస్తావించి, ఇది రైల్ కనెక్టివిటీ ని మెరుగు పరచడం కోసమే కాకుండా ఆ ప్రాంతం లో పర్యటన రంగాన్ని మరియు పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహిస్తుంది అని వివరించారు. సోండాలియా – చంపాపుకుర్, ఇంకా దన్‌కునీ- భట్టనగర్ – బాల్టికురీ రైలు మార్గాల యొక్క డబ్లింగు ను గురించి కూడా ఆయన మాట్లాడారు. కోల్ కాతా లో ఉన్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు లో మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయడం కోసం తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల ను గురించి మరియు 1,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మరో మూడు ప్రాజెక్టుల ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.
Speaking at launch of development works in Arambagh. These projects will significantly boost West Bengal's growth. https://t.co/cA2luBiZDo
— Narendra Modi (@narendramodi) March 1, 2024
21वीं सदी का भारत तेज गति से आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) March 1, 2024
हम सभी ने मिलकर 2047 तक विकसित भारत बनाने का लक्ष्य तय किया है: PM @narendramodi pic.twitter.com/7XWbTmIqKw
हमारा प्रयास है कि पश्चिम बंगाल में रेलवे का आधुनिकीकरण उसी रफ्तार से हो, जैसे देश के दूसरे हिस्सों में हो रहा है: PM @narendramodi pic.twitter.com/sNW5La8Qhf
— PMO India (@PMOIndia) March 1, 2024
भारत ने दुनिया को दिखाया कि पर्यावरण के साथ तालमेल बिठाकर विकास कैसे किया जा सकता है: PM @narendramodi pic.twitter.com/kJXrEkmbNl
— PMO India (@PMOIndia) March 1, 2024