పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏన్షంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ (అమెండ్ మెంట్) బిల్లు, 2017ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది.
నిషిద్ధ ప్రాంతంలో ప్రజలకు అత్యవసరమైన ప్రాజెక్టులు మరియు ప్రజా పనులకు మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని నిర్మాణాలకు అనుమతిని ఇవ్వడం కోసం ఈ కింద తెలిపిన సవరణలకు ఆమోదం తెలపడమైంది:
i) చట్టంలోని సెక్షన్ 2 లో ఉన్న “ప్రజా పనులు”కు ఒక కొత్త నిర్వచనాన్ని ప్రవేశపెట్టడం కోసం;
ii) చట్టంలోని 20A సెక్షన్ ను సవరించడం కోసం; దీని ద్వారా, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతిని పొందిన తరువాత- నిషిద్ధ ప్రాంతంలో ప్రజా పనులను చేపట్టేందుకు ఏదైనా విభాగానికి గాని, లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి గాని- అనుమతిని ఇవ్వడం జరుగుతుంది.
iii) ప్రధాన చట్టంలోని 20-I సెక్షన్ కు ఒక కొత్త క్లాజు (ea)ను ప్రవేశపెట్టడం;
పూర్వరంగం:
కేంద్రం రక్షణలో ఉన్న కట్టడం/స్థలం యొక్క నిషిద్ధ ప్రాంతం పరిధిలో కొత్త నిర్మాణానికి ఎటువంటి అనుమతినైనా మంజూరు చేయడాన్ని ఏన్షంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్టు, 1958 (2010వ సంవత్సరంలో సవరించడమైంది) నిషేధిస్తోంది.
నిషిద్ధ ప్రాంతం పరిధిలో కొత్త నిర్మాణం పైన అమలవుతున్న నిషేధం కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులు మరియు వేరు వేరు ప్రజా పనుల పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
తాజా సవరణ నిషిద్ధ ప్రాంతం పరిధిలో ప్రజలకు అత్యవసరమైన ప్రాజెక్టులు మరియు ప్రజా పనులకు సంబంధించిన కొన్ని పరిమితి నిర్మాణాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. అలాగే, విశాల ప్రజా ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.
***