పిఎంఇండియా
గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 26, 2015న నూయార్క్ లో జీ-4 దేశాల సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, జర్మనీ ఛాన్స్‌లర్ అంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేలను ఆహ్వానించారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మొదలైన సమస్యలు, సంఘర్షణల కారణంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రాతినిధ్యం, చట్టబద్ధత పెంచాల్సిన అవసరం ఉందని జీ-4 దేశాలు అభిప్రాయపడ్డాయి. ప్రపంచశాంతి, భద్రత విషయంలో బాధ్యత తీసుకునేందుకు జీ-4 సభ్యదేశాలు సంసిద్ధంగా ఉన్నాయని.. 21వశతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవటం ద్వారానే మార్పు సాధ్యమని ఈ సమావేశం అభిప్రాయపడింది.
2005 ప్రపంచ సదస్సు వరకు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన అభివృద్ధి కనిపించనందువల్ల ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాల అధ్యక్షులు భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇందుకు ఐక్యరాజ్యసమితి అత్యవసర మార్పులకు శ్రీకారం చుట్టాలని అవి అభిప్రాయపడ్డాయి. భద్రతామండలిలో సంస్కరణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తోందని, అయితే దీన్ని నిర్ణీత కాలవ్యవధిలో మరింత అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
అంతర్జాతీయ ప్రభుత్వాల మధ్య చర్చల (ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్-ఐజీఎన్) ద్వారా ఐక్యరాజ్యసమితిలో మార్పులకు చొరవతీసుకుంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ 69వ అధ్యక్షుడికి ఈ సమావేశం ధన్యవాదాలు తెలిపింది. లేఖల ద్వారా చర్చలు జరగాలంటూ.. ఐజీఎన్‌పై జూలై 31, 2015న ఐరాస 69వ అధ్యక్షుడు చేసిన ప్రసంగానికి 69/560తో సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదించటాన్ని సమావేశం స్వాగతించింది. 70వ సర్వపత్రినిధి సభకూ ఇదే సహకారం అందించాలని సమావేశం నిర్ణయించింది.
లేఖల ద్వారా చర్చలు జరిపేందుకు సభ్యదేశాలు తీసుకుంటున్న చర్యలను జీ-4 దేశాల అధినేతలు ప్రశంసించారు. మరీ ముఖ్యంగా ఆఫ్రికా సభ్య దేశాలైన ఎల్-69 గ్రూపు, సీఏఆర్ఐసీఓఎమ్‌లు తీసుకుంటున్న చర్యలను వారు స్వాగతించారు. భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యత్వంపై ఆఫ్రికా దేశాలు చేస్తున్న సహాయానికి మద్దతు తెలిపారు. భద్రతామండలిలో సంస్కరణలకోసం వివిధ దేశాలు, చిన్న చిన్న దీవులు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిపి మరిన్న చిన్న గ్రూపులు ఏర్పడాల్సిన ఆవశ్యకతను సమావేశం గుర్తించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం సభ్యదేశాలన్నీ పరస్పరం సహాయం చేసుకోవాలని సమావేశానికి హాజరైన సభ్యదేశాల అధినేతలు నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం పరస్పర సహకారం ఉండేలా ఒప్పందం కొనసాగించాలని నిర్ణయించారు. భద్రతా మండలిలో వీలైనంత త్వరగా.. సంస్కరణలు జరిగేలా ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలతో కలిసి పనిచేయటంతోపాటు.. ఈ నిర్ణయం వీలైనంత త్వరగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రయత్నంలో అనుకూల ఫలితాలు వచ్చేలా.. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి 70వ సర్వప్రతినిధి సభలో రెట్టింపు చేయాలని నిర్ణయించారు.
Joining ranks...the G4 leaders meet at a summit hosted by India in New York. @AbeShinzo @dilmabr pic.twitter.com/LwRk5yQMJh
— PMO India (@PMOIndia) September 26, 2015
Reforms in United Nations Security Council has been the focus of global attention for decades – unfortunately, without progress so far: PM
— PMO India (@PMOIndia) September 26, 2015
I am delighted that we are meeting again as Heads of Government after ten years: PM @narendramodi at the G4 Summit in New York
— PMO India (@PMOIndia) September 26, 2015
We live in a fundamentally different world from the time the UN was born: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2015