పిఎంఇండియా

ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్ష పదవికి ఎన్నికైన స్లొవాక్ రిపబ్లిక్ విదేశీ, యూరోపియన్ వ్యవహారాల మంత్రి శ్రీ మిరోస్లావ్ లాజ్కక్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.
ఐరాస సాధారణ సభ 72వ సమావేశాల సందర్భంగా, అధ్యక్ష పదవికి ఎన్నికైన శ్రీ మిరోస్లావ్ లాజ్కక్ ను ప్రధాన మంత్రి అభినందించారు. త్వరలో జరుగనున్న 72వ ఐరాస సాధారణ సభ సమావేశాలకు తాను ఎంచుకొన్న ప్రాథమ్యాలను శ్రీ లాజ్కక్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. శ్రీ లాజ్కక్ నూతన పదవీ బాధ్యతలను నిర్వర్తించడంలో భారతదేశం సంపూర్ణమైన, నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తుందని ఆయనకు ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.
ఉగ్రవాదం, ఐరాస లో సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు మరియు జల, వాయు పరివర్తనలు సహా ప్రపంచానికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళ పట్ల ఐరాస దృఢంగా వ్యవహరించవలసిన ఆవశ్యకతపై ఉభయులూ చర్చించారు.
Met Mr. @MiroslavLajcak, President Elect of the UNGA. pic.twitter.com/lu2Jcr8yOk
— Narendra Modi (@narendramodi) August 28, 2017