Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లాండ్ ప్రధానికి అపురూపమైన బహుమతులు అందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ


ఐర్లాండ్ ప్రధాని శ్రీ ఎండా కెన్నీ కి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పలు చారిత్రాత్మక, అపురూప బహుమతులను బహుకరించారు. ఎంతో కాలంగా భారతీయ పురావస్తు భాండాగారం ఆధీనంలో ఉన్న రాతప్రతులు ఈ బహుమతుల్లో ప్రధానమైనవి. గతంలో భారతదేశంలో పని చేసిన ఐర్లాండ్ అధికారులు శ్రీ థామస్ ఓల్దామ్ (1816-1878), శ్రీ జార్జ్ అబ్రహాం గ్రియర్ సన్ (1851-1941)లు భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు. అందుకు గుర్తింపుగా వారికి చెందిన విలువైన రాతప్రతులను శ్రీ మోదీ తన పర్యటన సందర్భంగా ఐర్లాండ్ ప్రధానికి బహుకరించారు.

శ్రీ థామస్ ఓల్దామ్ 1816లో డబ్లిన్ లో జన్మించారు. ఆయన్ను అప్పటి ప్రభుత్వం 1850లో జియాలజీ సర్వేయర్గా భారతదేశంలో నియమించింది. ఆయన ఆ సమయంలో బెంగాల్ ప్రభుత్వానికి సేవలందించారు. 1851 మార్చినెలలో ఛార్జి తీసుకున్న ఆయన ఆ తర్వాత ఎన్నో విధాలుగా ఈ రంగంలో నిరుపమానమైన కృషి చేశారు. అందుకే ఆయన మన దేశంలో ఛార్జి తీసుకున్న రోజును జియాలాజిక్ల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే గా జరుపుకుంటున్నాం. భారతదేశంలో నిక్షిప్తమైన బొగ్గు నిల్వలు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో సూచించే మొట్టమొదటి శాస్త్రీయ మ్యాప్ ను ఆయనే తయారు చేశారు. ఆ తర్వాత ఆయన బొగ్గు తోపాటు ఇతర ఖనిజాల మ్యాపులను కూడా తయారు చేశారు. భారతదేశంలోని ఫాసిల్స్ (శిథిల జీవాలు) గురించి విస్తృతంగా పలు రచనలు చేశారు.

ఇక శ్రీ జార్జ్ ఎ.గ్రియర్ సన్ విషయానికి వస్తే ఆయన ఐరిష్ దేశానికి చెందిన సివిల్ సర్వెంట్. ఆయన 1898లో మనదేశంలో పని చేయడం మొదలుపెట్టారు. భారతదేశ భాషల సర్వే ఆయన ఆధ్వర్యంలో కొనసాగింది. ఆయన ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన ఫిలాలజిస్టు (భాషా చరిత్ర,విమర్శ, సాహిత్య అధ్యయన నిపుణుడు). ఈయన చేసిన సర్వే 1903నుంచి28 వరకు పలు దఫాలుగా ప్రచురితమైంది. గ్రియర్ సన్ చేసిన లింగ్విస్టిక్ సర్వే కారణంగానే ఇండో ఆర్యన్ భాషలకు చెందిన మొదటి శాస్త్రీయ టాక్సోనమీ ( జీవ జాతులకు చెందిన వర్గీకరణ) వెలుగులోకి వచ్చింది. ఈ టాక్సోనమీలోనే హిందీ, ఉర్దూ ఇంకా ఇతర ఇండో ఆర్యన్ భాషల వ్యక్తీకరణకు సంబంధించిన వివిధ రూపాలున్నాయి. హిందీ భాష పశ్చిమ, తూర్పు మాండలిక విబాగాలుగా విడగొట్టడానికి గ్రియర్ సన్ వర్గీకరణ ఉపయోగపడింది. డబ్లిన్ కాలేజీలో గణితవిద్యార్థిగా ఉంటూనే గ్రియర్ సన్ సంస్కృతం,హిందీభాషల్లో పట్టు సంపాదించి పలు బహుమతులు గెలుచుకున్నారు. 1873 అక్టోబర్లో బెంగాల్కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ అధికారిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే ఎక్కువ సమయాన్ని భాషా పరిశోధనకు కేటాయించారు. మాండలికాలు, ఉప మాండలికాలకు సంబంధించి ఆయన వెలువరించిన పుస్తకాలలో సెవన్ గ్రామర్స్ ఆఫ్ ది డయలెక్ట్స్ అండ్ సబ్ డైలక్స్ట్ ఆఫ్ బీహారీ లాంగ్వేజ్ (1883-87), బీహార్ పీసెంట్ లైఫ్ (బీహార్ రైతు జీవితం..1885)లు ముఖ్యమైనవి. బీహార్ రైతు జీవతం పుస్తకం ఆ కాలనికి చెందిన భాషాపరమైన సమాచారాన్నిఅందించడంతో పాటు అప్పటి వ్యవసాయ పద్ధతులు,నమ్మకాలపై విలువైన విషయాలను చరిత్రకు అందించింది.

1994లో భారత ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక అవార్డును నెలకొల్పి హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన విదేశీయులను సత్కరిస్తోంది. .

ఈ ఇద్దరు సుప్రసిద్దులైన ఐర్లాండ్ అధికారులకు చెందిన విలువైన రాతప్రతులతోపాటు మరికొన్ని విలువైన వస్తువులను ప్రధాని శ్రీ మోదీ ఐర్లాండ్ ప్రధానికి బహుకరించారు. భారతీయ చేతి వృత్తి కళాకారులు వెండి, పాలరాతి, ఇసుకరాళ్లతో తయారుచేసిన కళాఖండాన్ని ఆయనకు బహుకరించారు. ఈ కళాఖండం ఐర్లాండ్ నేషనల్ ఎంబ్లమ్కు సింబల్ గా తయారైన కళాఖండం.