Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒకటో ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


వేదిక మీద ఉన్నటువంటి ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు మరియు శ్రీ కిరణ్ రిజిజూ గారు, ఒడిశా ప్రభుత్వం లోని మంత్రులు శ్రీ అరుణ్ కుమార్ సాహు గారు, శ్రీ తుషార్ కాంతి బెహెరా గారు,
ఇంకా దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు విచ్చేసినటువంటి యువ మిత్రులారా,

నేను సాంకేతిక విజ్ఞానం సహాయం తో మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడాను అక్కడ నెలకొన్నటువంటి వాతావరణాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని మరియు స్ఫూర్తి ని నేను గమనించగలుగుతున్నాను.

ఈ రోజు న, ఒడిశా లో ఒక నూతన చరిత్ర లిఖించబడుతోంది.  భారతదేశం యొక్క చరిత్ర లో మొట్టమొదటి సారి గా ఖేలో ఇండియా యూనివర్సిటి గేమ్స్ నేటి రోజు న మొదలవుతున్నాయి.

ఇది భారతదేశం యొక్క క్రీడల చరిత్ర లో ఒక చరిత్రాత్మకమైనటువంటి అధ్యాయం ఒక్కటే కాకుండా, భారతదేశం యొక్క క్రీడారంగ భవిష్యత్తు కోసం పడుతున్నటువంటి ఒక పెద్ద అడుగు కూడాను.

ఇవాళ, ప్రపంచం లో ఈ స్థాయి లో విశ్వవిద్యాలయ ఆటల ను నిర్వహిస్తున్నటువంటి  దేశాల సమితి లోకి, భారతదేశం సైతం చేరిపోయింది.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం కోసం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి తరలివచ్చినటువంటి 3000 మందికి పైగా యువ క్రీడాకారుల కు, యువ క్రీడాకారిణుల కు, ఒడిశా ప్రజానీకాని కి, మరి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకుగాను ప్రభుత్వాని కి అనేక అభినందనలు మరియు శుభాకాంక్షలూను.

మిత్రులారా,

రాబోయే కాలం లో 200కు పైగా స్వర్ణ పతకాల ను గెలుచుకోవాలన్న లక్ష్యం ఒక్కటి మాత్రమే కాకుండా, మరీ ముఖ్యం గా, మీరు మీ యొక్క స్వీయ ప్రదర్శనలను మెరుగుపరచుకోవాలన్న లక్ష్యాన్ని, మరి మీ స్వంత శక్తి ని నూతన శిఖరాల కు చేర్చే లక్ష్యాన్ని కూడా కలిగివున్నారు.

భువనేశ్వర్ లో, మీరు మిగతా వారి తో స్పర్ధ కు దిగడం మాత్రమే కాదు, మీతో కూడాను పోటీపడుతున్నారన్న సంగతి ని గుర్తు చేసుకోండి.
జ్ఞాపకం పెట్టుకోండి, భువనేశ్వర్ లో మీరు చేసే కఠోర శ్రమ మీ స్వప్నాల ను, మీ కుటుంబం యొక్క కలల ను మరియు భారతదేశపు కలల ను భుజాన మోసుకుపోనున్నది.

ఈ సమారోహం లో మార్గదర్శి దుతీ చంద్ గారు ల వంటి  ప్రేరణామూర్తులు అనేకులు మీ ముందు నిలచారు.  మీరు పతకాల ను సాధించాలన్న ఒక్క భావన తోనే కాక ఫిట్ నెస్ పరంగా దేశాని కి స్ఫూర్తి ని అందించాలన్న భావన తో కూడాను బరి లోకి దిగాలి.

మిత్రులారా,

ఈ దినం ఒక ఆటల పోటీ యొక్క ఆరంభం మాత్రమే కాకుండా, భారతదేశం లో క్రీడల ఉద్యమం లో తదుపరి దశ కు కూడాను ఆరంభాన్ని పలుకుతున్నది.

ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం ప్రజల ను క్రీడ ల దిశ గా ఆకర్షించడం లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషించింది. అలాగే దేశం లో ప్రతి మూల నుండి యువ ప్రతిభావంతుల ను గుర్తించడం లో కూడా ఓ ముఖ్య భూమిక ను పోషించింది.

బడి పిల్లల కోసం ఉద్దేశించిన ఈ దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని ఇప్పుడు  విశ్వవిద్యాలయ స్థాయి లో ఆరంభించడమైంది.  తద్వారా ఈ ప్రచార ఉద్యమాన్ని మరొక్క మెట్టు పైకి తీసుకుపోయినట్లు అవుతోంది.

ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం తో దేశం లో వచ్చిన మార్పు లు కిందటి నెల లో గువాహాటీ లో గోచరమయ్యాయి.

మిత్రులారా,

ఖేలో ఇండియా గేమ్స్ 2018వ సంవత్సరం లో మొదలైనప్పుడు, వాటి లో 3500 మంది క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు పాలుపంచుకొన్నారు.  అయితే కేవలం మూడు సంవత్సరాల లో క్రీడాకారులు మరియు క్రీడాకారిణుల సంఖ్య 6000కు పైబడి వృద్ధి చెందింది. అంటే, దాదాపు రెండింతలు అయిందన్న మాట.

ఒక్క సంఖ్య లే పెరుగుతూ ఉండడం కాక క్రీడల యొక్క నాణ్యత మరియు క్రీడల సంబంధిత మౌలిక సదుపాయాలు కూడాను నిరంతరాయంగా మెరుగుపడుతున్నాయి.  ఈ సంవత్సరం, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో 80 రికార్డులు బద్దలయ్యాయి. వీటిలో 56 రికార్డులు మన పుత్రిక ల పేరిట నమోదు అయ్యాయి.
ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా పెల్లుబుకుతున్నది పల్లెలు, చిన్న పట్టణాలు, పేద కుటుంబాలు మరియు మూడో అంచె, ఇంకా నాలుగో అంచె నగరాల కు చెందిన ప్రతిభామూర్తులే అనే విషయాన్ని గమనించడం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం.

ఇంతకు ముందు వనరుల లేమి నేపథ్యం లోను, అనుభవ రాహిత్యం నేపథ్యం లోను ముందుకు సాగలేకపోయింది ఈ ప్రతిభావంతులే.

ప్రస్తుతం ఈ ప్రతిభావంతులు చాలా చిన్న ప్రాయం లోనే వనరుల తో పాటు జాతీయ స్థాయి లో గుర్తింపు ను కూడా అందుకొంటున్నారు.

మిత్రులారా,

గడచిన అయిదారు సంవత్సరాలు గా భారతదేశం లో క్రీడల ఉన్నతి కోసం మరియు క్రీడల లో పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించడం కోసం చిత్తశుద్ధి గలిగిన ప్రయత్నాల ను చేపట్టడమైంది.  అది ప్రతిభ ను గుర్తించడం కావచ్చు, శిక్షణ కావచ్చు, లేదా ఎంపిక ప్రక్రియ కావచ్చు- ప్రతి చోటా పారదర్శకత్వాన్ని ప్రోత్సహించడం జరుగుతున్నది.  అంతర్జాతీయ పోటీల లో భారతదేశం యొక్క ప్రదర్శన లో దీని ఫలితం కూడా కనుపించింది.

ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం యువ ప్రతిభ ను గుర్తించడం కోసం ఒక ముఖ్య మాధ్యమం గా మారిపోయింది.  దీనిలో భాగం గా యువ క్రీడాకారుల ను/ క్రీడాకారిణుల ను ఎంపిక చేసి ప్రతి ఏటా 6.25 లక్షల వరకు సహాయాన్ని అందించడం జరుగుతున్నది.  ఇదే కాక, వారు దేశం లో 100కు మించిన ఎకేడెమీల లో శిక్షణ ను కూడా పొందారు.  ఇంత వరకు, ఆ తరహా క్రీడాకారుల ను/ క్రీడాకారిణుల ను సుమారు 3000 మంది ని ఎంపిక చేయడమైంది.  ఇటీవల, ఒక ఖేలో ఇండియా ఏప్ ను సైతం తీసుకురావడం జరిగింది.

అదే మాదిరి గా, ఒలంపిక్ పోడియమ్ స్కీము లో భాగం గా, దేశం లోని అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారుల ను/ క్రీడాకారిణుల ను ఉన్నత స్థాయి పోటీ ప్రదర్శనల కై సన్నద్ధం చేయడం జరుగుతున్నది.  ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశం లో దాదాపు గా 100 మంది అగ్రగామి నిపుణులైన క్రీడాకారుల కు/ క్రీడాకారిణుల కు తోడ్పాటు ను ఇవ్వడం జరుగుతున్నది.

మిత్రులారా,

ఈ క్రీడాకారులున్నారే, వారి కి టోక్యో ఒలంపిక్స్ లో పాలు పంచుకొనే అవకాశం దక్కవచ్చును.  ఈ పథకం తాలూకు లబ్ధి ని పొందుతున్నటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు కామన్ వెల్త్ గేమ్స్, ఏశియన్ గేమ్స్, ఏశియన్ పారా గేమ్స్ మరియు యూత్ ఒలంపిక్స్ ల వంటి స్పర్ధల లో దేశాని కి 200కు పైగా పతకాల ను సంపాదించి పెట్టారు.  దీనికి తోడు, ప్రతిభాన్విత క్రీడాకారుల కు/క్రీడాకారిణుల కు జీవనకాల పింఛను ను కూడా అందించడం జరుగుతున్నది.

మిత్రులారా,

క్రీడల లో పాల్గొనే వారు వారి యొక్క సర్వోత్తమమైనటువంటి ప్రదర్శన ను కనబరచడం పైన మాత్రమే దృష్టి పెట్టాలి.  మిగతా విషయాల ను దేశం చూసుకొంటుంది. విద్యా సంబంధమైన విషయాల తో పాటే విద్యార్థులు ఫిట్ నెస్ పట్ల మరియు క్రీడల పట్ల శ్రద్ధ ను  తీసుకొనేటట్టు పూచీపడాలి అని మేము ప్రయత్నిస్తున్నాము.   ప్రతి ఒక్క కోవ కు చెందిన వృత్తిజీవనం కోసం కూడాను మన యువ క్రీడాకారుల ను, మన యువ క్రీడాకారిణుల ను యోగ్యులు గా తీర్చిదిద్దడం కోసం నేశనల్ స్పోర్ట్స్ యూనివర్సిటి వంటి సంస్థల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

మిత్రులారా,

దేశ యువత యొక్క ఫిట్ నెస్ కావచ్చు లేదా అంతర్జాతీయ క్రీడల లో భారతదేశం యొక్క ఆధిపత్యం కావచ్చు- మనం రెండు రంగాల లోనూ మన యొక్క సర్వోత్తమమైనటువంటి తోడ్పాటు ను అందిస్తున్నాము.

ఇప్పుడు ఇక నేను ఒకటో ఖేలో ఇండియా యూనివర్సిటి గేమ్స్ ఆరంభం అవుతున్నాయని మర్యాదపూర్వకం గా ప్రకటిస్తున్నాను.

మీకు అందరి కి శుభం జరగాలని మరొక్క మారు నేను ఆకాంక్షిస్తున్నాను.

ఇంతటి ఒక మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గాను శ్రీ నవీన్ గారి కి మరియు ఒడిశా ప్రభుత్వాని కి నేను నా హృద‌యాంతరాళం లో నుండి ధన్యవాదాలు పలుకుతున్నాను.  మరి అలాగే జగన్నాథ భగవానుని యొక్క కృప తో మనం జగత్తు ను జయించగలుగుతాము అని కూడాను నేను ఆశపడుతున్నాను.  జయ్ జగన్నాథ్.  మీరు రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

**