పిఎంఇండియా
ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రోడ్డు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సి సి ఇ ఎ) ఆమోదం తెలిపింది. ఇది ఆ రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలను, అనుసంధానాన్ని మెరుగుపరచడంలో తోడ్పడగలదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరుస ట్వీట్ లలో వెల్లడించారు.
“పంజాబ్ లోని జాతీయ రహదారి 344 ఎ కు చెందిన ఫగ్బాడా, రూప్‌నగర్ సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను సి సి ఇ ఎ ఆమోదించింది.
ఇంచుమించుగా 80.820 కిలోమీటర్ల దూరమున్న ఈ రహదారిని అభివృద్ధి పరచేందుకు రూ. 1,444.42 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల్ పంజాబ్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచగలదు. అంతే కాకుండా, ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దగలదు.
ఒడిశా లోని జాతీయ రహదారి-42 (న్యూ ఎన్ హెచ్-55) కు చెందిన అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు సి సి ఇ ఎ ఆమోదం తెలిపింది.
ఇంచుమించు 151 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారిని అభివృద్ధి పరచేందుకు రూ. 2,491.53 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టు ఒడిశాలో మౌలిక సదుపాయాలను వేగంగా మెరుగుపరచడంతో పాటు అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ లో ప్రయాణ ఖర్చును, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో కూడా దోహదం చేయగలదు. మరీ ముఖ్యంగా అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ లో భారీ స్థాయిలో నడిచే వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండగలదు.
మహారాష్ట్రలోని జాతీయ రహదారి 211కి చెందిన ఔరంగబాద్-తేల్ వాడి సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి పరచే ప్రతిపాదనకు సి సి ఇ ఎ ఆమోదం తెలిపింది.
ఇంచుమించు 87 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును తీర్చిదిద్దడానికి రూ. 2,028.91 కోట్ల వ్యయం కావచ్చని అంచనా వేశారు.
ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు చక్కబడడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగగలవు.” అని ప్రధాన మంత్రి వివరించారు.
CCEA, chaired by PM approved the development of four laning of Phagwara-Rupnagar Section of NH-344A in Punjab. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The cost is estimated to be Rs.1444.42 crore & total length of the road to be developed is approximately 80.820 kms. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
Project will improve infrastructure in Punjab & will also help in uplifting the socio-economic condition of this region in the State.
— PMO India (@PMOIndia) June 29, 2016
CCEA approved the development of four laning of Angul-Sambalpur Section of NH-42 (New NH-55) in Odisha. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The cost is estimated to be Rs.2491.53 crore & total length of the road to be developed is approximately 151 kms. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The project will help in expediting the improvement of infrastructure in Odisha and in reducing the time & cost of travel for traffic (1/2)
— PMO India (@PMOIndia) June 29, 2016
...particularly heavy traffic, plying between Angul and Sambalpur section. (2/2) #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016