Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లోని తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఒడిశా లోని తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఒడిశా లోని తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఒడిశా లోని తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఇక్కడి వేదిక‌ ను అలంక‌రించిన ఒడిశా గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెసర్ గ‌ణేశి లాల్ గారు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌రియు నా స్నేహితుడు శ్రీ‌మాన్ న‌వీన్ ప‌ట్నాయ‌క్ గారు, కేంద్ర మంత్రివ‌ర్గం లో నా స‌హ‌చ‌రులు శ్రీమాన్‌ జుయల్ ఉరావ్ గారు, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, పార్ల‌మెంటు లో నా స‌హ‌చ‌రుడు శ్రీ స‌త్‌ప‌తి గారు, ఈ ప్రాంతానికి చెందిన విధాన స‌భ స‌భ్యుడు బ్ర‌జ్‌ కిశోర్ ప్రధాన్ గారు, ఇంకా నా ప్రియ‌త‌మ సోద‌రీమణులు మ‌రియు సోద‌రులారా,

ఈ కార్య‌క్ర‌మం ముగిశాక ఓ పెద్ద జ‌న స‌భ లో నేను ప్ర‌సంగించ‌నున్నాను. కాబ‌ట్టి ఈ కారణంగా ఈ క‌ర్మాగారాన్ని గురించిన పూర్తి వివ‌రాలను వెల్లడించాల‌ని నేను అనుకోవ‌డం లేదు. ఈ శుభ‌ప్ర‌ద‌మైన సంద‌ర్భం లో నా హర్షాన్ని మాత్రం వ్య‌క్తం చేయ‌ద‌లచుకొన్నాను. ఈ కార్య భారాన్ని స‌కాలం లో పూర్తి చేసేందుకు శ్ర‌మించిన అంద‌రికీ నేను నా యొక్క శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను.

ఒక రకంగా, ఈ ఎరువుల క‌ర్మాగారాన్ని పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ద‌క్క‌డం నా భాగ్యం. ఈ ప్రాంత ప్ర‌జ‌లు కొన్ని ద‌శాబ్దాల కింద‌టే క‌న్న క‌ల కొన్ని కార‌ణాల రీత్యా ఫ‌లించ‌ లేదు. ఈ క‌ర్మాగారం ఎన్న‌టికైనా పున‌రుద్ధ‌రింపబ‌డుతుంద‌న్న ఆశ‌ ను వారు వ‌దులుకున్నారు.

అయితే, మేం ఒక ప‌విత్ర‌మైన ప్ర‌తిజ్ఞ‌ ను స్వీక‌రించాం.. అది ఏమిటంటే, కొత్త శ‌క్తి తో, నూతనమైన వేగ గ‌తి తో దేశాన్ని అభివృద్ధి ప‌ర‌ంగా స‌రిక్రొత్త శిఖరాల‌కు తీసుకుపోవాల‌నేదే. అందుక‌ని మేం ప‌లు బ‌డా ప్రాజెక్టుల‌ ను మ‌రియు ప‌థ‌కాల‌ ను చేప‌ట్టాం. నవీనమైన శ‌క్తి, గ‌మ‌నం, దృఢ సంక‌ల్పం అవ‌స‌ర‌మ‌య్యే కార్య‌క్ర‌మాల‌ను తీసుకున్నాం. మ‌రి ఫ‌లితం ఈ రోజున మీ అంద‌రి ముందు ఉంది. సుమారు 13,000 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో ఈ క‌ర్మాగారం పున‌రుద్ధ‌ర‌ణ‌ కు నోచుకొంటోంది.

ఇది భార‌త‌దేశానికి పూర్తి కొత్త సాంకేతిక‌త‌. ఈ ప్రాంతం లో ల‌భ్య‌మ‌య్యే బొగ్గు గ్యాసిఫికేష‌న్ తాలూకు సాంకేతిక‌ విజ్ఞానం తో ఈ ప్రాంత‌ం ఒక్కటే కాక యావ‌త్తు దేశం కూడా ఒక కొత్త దిశ‌ ను పొంద‌బోతోంది. ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవ‌డం ద్వారా విదేశాల నుండి గ్యాస్ ను, ఇంకా ఎరువుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం నుండి దేశం విముక్తం కానుంది. ఇది ధ‌నాన్ని కూడా ఆదా చేయనుంది.

ఈ క‌ర్మాగారం పున‌రుద్ధ‌ర‌ణ తో ఈ ప్రాంతం లో యువ‌తీయువ‌కుల‌ కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భించగలవు. దాదాపు 4,500 మంది ఈ ప్రాజెక్టు తో ముడిప‌డ‌నున్నారు. ఈ ప్రాజెక్టు ప‌రిస‌ర ప్రాంతాల లో అనేక సదుపాయాలు రూపుదిద్దుకోనున్న కార‌ణంగా అద‌న‌పు లాభాలు సైతం స‌మ‌కూరుతాయి.

అభివృద్ధి యొక్క దిశ‌ ను మార్చ‌డం ఎలా? – విధానం స్ప‌ష్టం గా ఉంటే, ఉద్దేశం మంచిది అయితే- చ‌క్క‌ని నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంది. మ‌నం ర‌త్నాల‌ ను గురించి, మ‌హార‌త్నాల‌ ను గురించి, ఇంకా న‌వ‌ర‌త్నాల గురించి వింటూ వ‌స్తున్నాం. కొన్ని సంద‌ర్భాల లో మంచి వార్త‌లు ఉంటే, మ‌రికొన్ని సంద‌ర్భాల లో చెడ్డ వార్త‌లు కూడా ఉంటున్నాయి. అటువంటి ర‌త్నాల‌న్నీ క‌ల‌సి బాధ్య‌త‌ ను భుజానికి ఎత్తుకొన్న ప‌క్షం లో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. వారి లో ప్ర‌తి ఒక్క‌రి ప్రావీణ్యం, వారి లో ప్ర‌తి ఒక్క‌రి నుండి అందే ఆర్థిక స‌హాయం ఈ ప్రాజెక్టు పున‌రుద్ధ‌ర‌ణ లో ఒక భాగం కావ‌డం తో పాటు ఒక్క ఒడిశా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను మాత్ర‌మే కాకుండా యావ‌త్తు దేశం లోని రైతుల అవ‌స‌రాల‌ను కూడా తీర్చ‌గ‌లిగేలా ఇది రూపుదిద్దుకోగలుగుతుంది.

ఈ క‌ర్మాగారం ఉత్ప‌త్తి ని ప్రారంభించాలంటే 36 మాసాలు ప‌డుతుంద‌ని నా దృష్టికి తీసుకు వ‌చ్చారు. నేను ఈ త‌ర‌హా ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించ‌డాన్ని కొన‌సాగిస్తాను. ఉత్ప‌త్తి ఎప్ప‌టి నుండి మొద‌ల‌వుతుంద‌ని నేను అడిగితే, అందుకు ఇప్ప‌టి నుండి 36 నెల‌లు అవుతుంద‌ని నాతో చెప్పారు. 36 నెల‌ల త‌రువాత ఈ ప్రోజెక్టును ప్రారంభించడానికి నేను మ‌ళ్ళీ ఇక్క‌డ‌కు వ‌స్తాను. ఈ న‌మ్మ‌కం తోనే, ముఖ్య‌మంత్రి కి నా హృద‌య పూర్వ‌క‌మైన కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేస్తూ నా ఉప‌న్యాసాన్ని ఇక ముగిస్తున్నాను.

మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

***