Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన


ఒప్పందాలు:

S. No.

Title

Brief description

1

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, న్యూజిలాండ్ రక్షణ దళం మధ్య నౌకా వాణిజ్య సహకారంపై ఒప్పందం

చర్చలుసమన్వయంసమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా ఇండో-పసిఫిక్‌లో మెరుగైన నౌకా వాణిజ్య సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది.

2

భారత్-న్యూజిలాండ్ మధ్య హైడ్రోగ్రఫీ, నాటికల్ కార్టోగ్రఫీ విషయాల్లో సహకార అమలు సంబంధిత ఒప్పందం అమలు

నావిగేషనల్ చార్టుల ఉమ్మడి రూపకల్పనహైడ్రోగ్రాఫిక్ డేటాను పంచుకోవడంశిక్షణ-సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా హైడ్రోగ్రఫిక్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది.

3

భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళం మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతుకు సంబంధించిన ఒప్పందం

ఆమోదిత కార్యకలాపాలు, ఆపరేషన్ల సమయంలో భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళం మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతును సులభతరం చేస్తుంది.

4

భారత్-న్యూజిలాండ్ మధ్య ఉగ్రవాద నిరోధకతపై సంయుక్త కార్యవర్గం ఏర్పాటు గురించిన ఒప్పందం

సహకారాన్ని బలోపేతం చేయడానికిసమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, ఉగ్రవాద వ్యతిరేక పోరాట ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తుంది.

5

భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ (ఎన్ఈఎమ్ఏమధ్య సహకారం కోసం అవగాహన ఒప్పందం

భూకంప నిరోధకతసునామీ సంసిద్ధతతీరప్రాంత ప్రమాద నివారణపరస్పరం విజ్ఞానాన్ని పంచుకోవడంవిధానపరమైన చర్చలు, సామర్థ్యాలను పెంపొందించడం కోసం ప్రాధాన్యమిస్తూ… విపత్తుల సంబంధిత ప్రమాద నిర్వహణలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.

6

భారత మత్స్యపశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ-న్యూజిలాండ్ ప్రాథమిక పరిశ్రమల మంత్రిత్వ శాఖల మధ్య పశుసంవర్ధకం. పాడిపరిశ్రమల రంగాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందం

సాంకేతిక సహకారంపరస్పరం విజ్ఞానాన్ని పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల ద్వారా పశుపోషణ, పాడి పరిశ్రమలో మెరుగైన సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను రూపొందిస్తుంది.

7

భారత పర్యాటక మంత్రిత్వ శాఖ-న్యూజిలాండ్ వ్యాపారఆవిష్కరణ, ఉపాధి మంత్రిత్వ శాఖల మధ్య పర్యాటక రంగ ఒప్పందం

ఆర్థిక సంబంధాల బలోపేతంపర్యాటకుల సంఖ్యను పెంచడం, ఇరు దేశాల సంస్కృతిపై పరస్పర అవగాహనను పెంపొందించడం కోసం పర్యాటక రంగంలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.

8

క్రీడలపై భారత్-న్యూజిలాండ్ సంయుక్త కార్యాచరణ ప్రణాళిక

అత్యున్నత స్థాయి క్రీడలుక్రీడా విజ్ఞానంక్రీడా వైద్యం, అథ్లెట్ల అభివృద్ధి సహా క్రీడల్లో సహకారానికి ఒక విధాన ప్రణాళికను అందిస్తుంది.

9

గుజరాత్‌లోని లోథాల్‌లో జాతీయ సముద్ర వారసత్వ సముదాయం (ఎన్ఎమ్‌హెచ్‌సీఅభివృద్ధి కోసం ఎన్ఎమ్‌హెచ్‌సీ-న్యూజిలాండ్ మారిటైమ్ మ్యూజియం మధ్య ఒప్పందం.

సహకారం, పరస్పర అంగీకారం గల ప్రాజెక్టుల ద్వారా లోథాల్‌లో ఎన్ఎమ్‌హెచ్‌సీని అభివృద్ధి చేయడంలో సహకారానికి ఒక విధాన ప్రణాళికను అందిస్తుంది.

10

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ – న్యూజిలాండ్ సాంస్కృతిక, నాగరికత మంత్రిత్వ శాఖల మధ్య సాంస్కృతిక సహకారంపై ఒప్పందం

పరస్పర అవగాహననుప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కళలునాగరికత, సాంస్కృతిక కార్యక్రమాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.

ప్రకటనలు:

 

S. No.

Title

Brief description

1

భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం, 2030 కోసం కార్యాచరణ ప్రణాళిక

భారత్-న్యూజిలాండ్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించుకున్నాయి. వాణిజ్యంరక్షణనౌకా వాణిజ్య భద్రతపర్యాటకంసంస్కృతిక్రీడలువ్యవసాయ-సాంకేతికతప్రజా సంబంధాలుఇండో-పసిఫిక్ ప్రాధాన్యతలు, బహుపాక్షిక అంశాలపై సమన్వయం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. రాబోయే నాలుగు సంవత్సరాల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, భాగస్వాముల మధ్య భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసే ఒక వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రోడ్‌మ్యాప్ టు 2030‘ అందిస్తుంది.

2

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్లుకు లేదా రూ. 35,000 కోట్లకు పెంచడం ద్వారా దానిని రెట్టింపు చేయడం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో… ఆర్థిక సంబంధాల బలోపేతం, మార్కెట్‌ను మరింత అందుబాటులో ఉండేలా విస్తరించడం కోసం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్లకు (రూ. 35,000 కోట్లకు) పెంచడం ద్వారా దానిని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ఇరుపక్షాలు నిర్దేశించుకున్నాయి.

3

నౌకా వాణిజ్య భద్రతకు సంబంధించి చర్చా వేదికను ఏర్పాటు చేయడం

సహకారంసమన్వయం, పరస్పరం సమాచారాన్ని పంచుకోవడాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత్-న్యూజిలాండ్ దేశాలు నౌకా వాణిజ్య భద్రతకు సంబంధించి చర్చా వేదిక ఏర్పాటుకు అంగీకరించాయి.

4

ఇండో-పసిఫిక్ మహాసముద్ర చొరవ (ఐపీవోఐకింద నౌకా వాణిజ్య భద్రతను ప్రాధాన్య మూలాధారంగా న్యూజిలాండ్ నామినేట్ చేసింది.

ఐపీవోఐ ఏడు మూలాధారాల కింద… చట్టవిరుద్ధమైననివేదించని, నియంత్రణ లేని (ఐయూయూచేపల వేటను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన నిర్దిష్ట సహకార కార్యకలాపాలను చేపట్టడానికి నౌకా వాణిజ్య భద్రతనూ ఒక కీలక మూలాధారంగా న్యూజిలాండ్ చేర్చింది.

5

గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో న్యూజిలాండ్ చేరుతోంది

గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో న్యూజిలాండ్ చేరిక… పరిశుద్ధ ఇంధన పరివర్తన కోసం సుస్థిర బయోఫ్యూయల్స్ అభివృద్ధినీ, అమలునూ వేగవంతం చేయడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలపరుస్తుంది.

6

కివీఫ్రూట్ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం… నాగాలాండ్ఉత్తరాఖండ్‌లలో కివీఫ్రూట్ కోసం 2 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యం కింద… ఉత్పాదకతను పెంచడం కోసం విద్యనైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఆవిష్కరణల్లో సహకారంతో పాటునాగాలాండ్, ఉత్తరాఖండ్‌లలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేస్తూ ఒక కివీఫ్రూట్ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తున్నారు.

7

గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్‌సీపీవోఆర్) న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం

అంటార్కిటిక్ పరిశోధనలో సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను రూపొందిస్తుంది. ఉమ్మడి పరిశోధనవిద్యాపరమైన సమాచారాన్ని పంచుకోవడంసామర్థ్యాలను పెంపొందించడం, ఇతర పరస్పర ప్రయోజనకరమైన శాస్త్రీయ, విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

8

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీఆంత్రప్రిన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్కుండ్లి (ఎన్ఐఎఫ్‌టీఈఎమ్కె)మాస్సే యూనివర్సిటీన్యూజిలాండ్ మధ్య అవగాహన ఒప్పందం

పరిశోధనవిద్యాసంబంధ సమాచారం పంచుకోవడం, విద్యార్థుల రాకపోకలు, పరస్పరం అంగీకరించిన ఇతర విద్యా కార్యకలాపాల్లో సహకారానికి ఒక విధాన రూపకల్పనను రూపొందిస్తుంది.