పిఎంఇండియా
ఓనం పండగ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండగ కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండగ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఓనం పండగ శుభాకాంక్షలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉత్సాహంతో జరుపుకొనే శక్తిమంతమైన పండుగ.
ఇది సంతోషం, ఐక్యత, శ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నా”.
***
ഏവർക്കും മനോഹരമായ ഓണം ആശംസിക്കുന്നു. ലോകമെമ്പാടും വലിയ ആവേശത്തോടെ ആഘോഷിക്കപ്പെടുന്ന ഊർജസ്വലമായ ഉത്സവമാണിത്.
— Narendra Modi (@narendramodi) August 26, 2026
ഈ ഉത്സവം സന്തോഷത്തിന്റെയും ഒത്തൊരുമയുടെയും സമൃദ്ധിയുടെയും മനോഭാവത്തിന് കൂടുതൽ കരുത്തുപകരട്ടെ.
Have a wonderful Onam. This is a vibrant festival that is being marked all… pic.twitter.com/nESTbJWyKP