Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా కార్యాల‌యం లో ఒక డిప్యూటీ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


కంప్ట్రోల‌ర్ & ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా కార్యాల‌యం లో ఒక డిప్యూటీ కంప్ట్రోల‌ర్ & ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కోఆర్డినేశ‌న్, క‌మ్యూనికేశ‌న్ అండ్ ఇన్‌ఫ‌ర్మేశ‌న్ సిస్ట‌మ్) పదవి ని పే లెవెల్- 17 తో (ఒక ఎస్‌టిఎస్ స్థాయి ప‌ద‌వి ని ర‌ద్దు చేయ‌డం ద్వారా) ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ఆడిట్ లు, టెలికమ్యూనికేశ‌న్ యొక్క ఆడిట్ ల స‌మ‌న్వ‌యాన్ని డిప్యూటీ కంప్ట్రోల‌ర్ & ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ర్య‌వేక్షించ‌డం తో పాటు, ఇండియ‌న్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (ఐఎ&ఎడి)లోని వివిధ స‌మాచార వ్య‌వ‌స్థ (ఐఎస్)ల కార్య‌క్ర‌మాల‌ ను కూడా స‌మ‌న్వ‌యప‌రచ‌వ‌ల‌సి ఉంటుంది.

ఈ ప‌ద‌వి ని ఏర్పాటు చేయడానికి సుమారు 21 ల‌క్ష‌ల రూపాయ‌లు వ్య‌య‌మవుతుంది.