Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కన్నడ రాజోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఇవాళ కన్నడ రాజోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

గొప్ప సంప్రదాయాలు, విశేషమైన విజయాలు, అపారమైన అవకాశాలు గల నేల కర్ణాటక అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీని ఘనమైన వారసత్వం, శాశ్వత సంప్రదాయాలు మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశాయన్నారు.

“కర్ణాటక ప్రజల కష్టపడే తత్వం, పారిశ్రామిక దృక్పథం, విశేషమైన నైపుణ్యాలతో, ముఖ్యంగా భవిష్యత్తు ఆధారిత రంగాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సమాచార సాంకేతికత, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ నుంచి కృత్రిమ మేధస్సు, అధునాతన తయారీ, అంకుర సంస్థల వరకు కర్ణాటక ప్రజల సామర్థ్యాన్ని ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉన్నారు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

సంప్రదాయాలు, విశేష విజయాలు, అపారమైన అవకాశాలకు నిలయం కర్ణాటక. ఇక్కడి గొప్ప వారసత్వం,  కాలాతీతమైన ఆచారాలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరింత ఇనుమడింపజేశాయి.

కర్ణాటక ప్రజల కఠిన శ్రమ, పట్టుదల, విశేష నైపుణ్యాలతో, ముఖ్యంగా భవిష్యత్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమాచార సాంకేతికత, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ నుంచి కృత్రిమ మేధస్సు, అధునాతన తయారీ రంగాలు, అంకుర సంస్థల వరకు కర్ణాటక ప్రజలు సత్తాను చాటారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు సవాళ్లకు పరిష్కారాలు చూపటంలో కన్నడ ప్రజలు ఎల్లప్పుడూ ముందుంటున్నారు.

ఈ ప్రత్యేక సందర్భం కర్ణాటక ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.