Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరెన్సీని పరస్పరం మార్పిడి చేసుకోవడంలో సహకారం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అవగాహనపూర్వక ఒప్పందం


కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు (యు ఎ ఇ) మధ్య 2016 ఫిబ్రవరిలో సంతకాలు జరిగిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) గురించి కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకు వ‌చ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఆర్ బి ఐ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యు ఎ ఇ లు సాంకేతికపరమైన సంప్రదింపులు జరిపిన తరువాత పరస్పర అంగీకారం కుదిరిన నియమ నిబంధనల మేరకు కరెన్సీ ద్వైపాక్షిక మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేసే అంశాన్ని పరిశీలించే పరిస్థితిని ఈ ఎమ్ ఒ యు కల్పిస్తుంది. అయితే దీనికి ఉభయ ప్రభుత్వాల సమ్మతి కూడా అవసరమవుతుంది. ద్వైపాక్షిక వ్యాపారంలో ఇన్ వాయిస్ లను స్థానిక కరెన్సీ లలో రూపొందించడానికి కూడా ఈ స్వాప్ అగ్రిమెంట్ తోడ్పడగలదని ఆశిస్తున్నారు.

భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ల మధ్య నెలకొన్న సన్నిహిత ఆర్థిక సంబంధం మరియు సహకారాన్ని ఈ ఎమ్ ఒ యు మరింత పటిష్టపరచగలదు.

***