Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలో ప్రధాని పర్యటన: శ్రీ గురు భైరవైక్య మందిరం ప్రారంభ విశేషాలను ప్రజలతో పంచుకున్న శ్రీ మోదీ

కర్ణాటకలో ప్రధాని పర్యటన: శ్రీ గురు భైరవైక్య మందిరం ప్రారంభ  విశేషాలను ప్రజలతో పంచుకున్న శ్రీ మోదీ


ఈ రోజు కర్ణాటక పర్యటన విశేషాలనుముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

కర్ణాటక మాండ్య జిల్లాలోని శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.

ఆ పవిత్ర క్షేత్రం కాలాతీతమైన దేశ ఆధ్యాత్మిక స్ఫూర్తికిసేవా సంప్రదాయాలకుజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

తన పర్యటన సందర్భంగా జ్వాలా పీఠాన్ని కూడా సందర్శించిన ప్రధానమంత్రి.. శ్రీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు.

పరమపూజ్య జగద్గురు శ్రీశ్రీశ్రీ డాబాలగంగాధరనాథ మహాస్వామిజీకి కూడా ఆయన నివాళి అర్పించారుఆధ్యాత్మికతకుసేవా భావానికి మార్గదర్శిగా నిలిచారంటూ కొనియాడారుసామాజిక సాధికారత దిశగా ఆయన ప్రశంసనీయమైన సేవలందించారనిప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:

ఈ రోజు ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించాను. శాశ్వతమైన దేశ ఆధ్యాత్మిక స్ఫూర్తికిఎన్నటికీ నిలిచి ఉండే మన సేవా సంప్రదాయాలకుజ్ఞానానికి ఈ పవిత్ర క్షేత్రం ప్రతీకగా నిలుస్తోంది.

శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో జ్వాలా పీఠాన్ని సందర్శించిశ్రీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశాను.

పరమపూజ్య జగద్గురు శ్రీశ్రీశ్రీ డాబాలగంగాధరనాథ మహాస్వామిజీకి ప్రణమిల్లానుఆధ్యాత్మికతకుసేవకు ఆయనొక మార్గదర్శిసమాజ సాధికారత కోసం ప్రశంసనీయమైన కృషి చేశారాయనప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాల్లో ఆయన కృషి వెలుగులను నింపింది.’’  

 

***