Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బెళగావి లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో యువత భారతదేశాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తుందన్నారు. ఇందుకోసం మనకు నైపుణ్యం కలిగిన యువతీయువకులు అసరం, అలాగే పరిశోధన, నవకల్పన కూడా మనకు కీలకమే అని ఆయన చెప్పారు.

నిష్కపట పౌరులను కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కష్టపెట్టదని అదే సమయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడేటట్లు చూస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.