పిఎంఇండియా
కర్బన సంగ్రహణ ప్రక్రియ భారత్ ఉక్కు రంగంలో భావి విప్లవానికి ఎలా దోహదం చేయనుందో వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘2070 కల్లా నికర శూన్య ఉద్గారాల స్థాయిని అందుకోవాలన్న లక్ష్యమూ, వ్యూహాత్మక పెట్టుబడులూ, హైడ్రోజన్ కార్యక్రమాలతో పాటు ఇతర రంగాల్లో మన నిర్దేశిత ప్రయత్నాలూ అభివృద్ధి సాధనకీ, ప్రపంచ దేశాలతో పోటీపడడానికీ చోదక శక్తిగా ఉంటూ వికసిత్ భారత్ వైపు మన పయనాన్ని వేగిరపరుస్తాయని కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి అంటున్నారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి వ్యాసంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ తన స్పందనను తెలియజేస్తూ–
‘‘కర్బన సంగ్రహణ భారత్లో ఉక్కు రంగంలో తదుపరి క్రాంతికి దన్నుగా నిలుస్తుంది. 2070వ సంవత్సరానికల్లా నికర శూన్య ఉద్గారాల స్థాయిని అందుకోవాలన్న మన నిబద్ధత, వ్యూహాత్మక పెట్టుబడులు, హైడ్రోజన్ కార్యక్రమంతో పాటు ఇతర రంగాల్లో మన నిర్దేశిత ప్రయత్నాలు అభివృద్ధికీ, ప్రపంచ దేశాలతో పోటీపడటానికీ దోహదం చేస్తాయనీ, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో మార్గదర్శకం అవుతాయనీ కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి అంటున్నారు.
మరింత సమాచారం కోసం ఈ వ్యాసాన్ని తప్పక చదవగలరు..’’ అని పేర్కొన్నారు.
***
Carbon capture can power India’s next steel revolution. Union Minister Shri @hd_kumaraswamy writes how our guided efforts towards Net Zero 2070 commitment, strategic investments, hydrogen initiatives and a lot more shall drive growth, global competitiveness and lead the road to a… https://t.co/UC01RbacET
— PMO India (@PMOIndia) February 11, 2026