పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు- 2026లో రజత పతకం సాధించిన మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
మహమ్మద్ బాసిల్ ప్రదర్శించిన వేగాన్ని (స్ప్రింట్), పట్టుదలను ప్రధానమంత్రి కొనియాడారు. ఈ ప్రదర్శన అతనికి ఈ సీజన్లోనే అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు.
ఈ విజయం మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్కు ఉన్న కష్టపడే తత్వానికి, ఏకాగ్రతకు నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్ అద్భుతమైన తీరులో రజత పతకం సాధించారు. ఎంతటి వేగవంతమైన పరుగు, పట్టుదల ప్రదర్శన! ఈ విజయం సాధించినందుకు, ఈ సీజన్లోనే తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసినందుకు నా అభినందనలు. అతని విజయం అతని శ్రమను, ఏకాగ్రతను ప్రతిబింబిస్తుంది. రాబోయే కాలంలో అతను మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను”.
***
A superb Silver for Mohammed Basil Morssinganakath! What a sprint and display of determination! Congratulations to him for the success and also achieving his Season Best. His success reflects his hard work and focus. May he continue to scale new heights in the times to come.…
— Narendra Modi (@narendramodi) July 30, 2026