Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య విజేత సెల్వ ప్రభు తిరుమారన్‌కు ప్రధానమంత్రి అభినందన


   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకం సాధించిన సెల్వ ప్రభు తిరుమారన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ పతక సాధనలో భాగంగా ఆయన తన వ్యక్తిగత రికార్డును అధిగమించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘనత సాధించడంపై అభినందనలు తెలపడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“కామన్వెల్త్ గేమ్స్‌ ట్రిపుల్‌ జంప్‌లో తన వ్యక్తిగత రికార్డును అధిగమించి కాంస్య పతకం గెలుచుకున్న సెల్వ ప్రభు తిరుమారన్‌ ప్రతిభ నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. అతనికి నా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులోనూ ఆ క్రీడాకారుడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.