పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల షాట్పుట్ ఎఫ్57 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోమన్ రాణాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
అసాధారణ విజయంతో ఈ విభాగంలో భారత్కు తొలి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని సోమన్ రాణా సముపార్జించి పెట్టాడని ప్రధానమంత్రి అన్నారు.
ఈ పోటీలో ఆద్యంతం ఏకాగ్రత, అకుంఠిత దీక్షతో తన సంకల్పం సాకారం చేసుకున్నాడని శ్రీ మోదీ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:
“సోమన్ రాణా సరికొత్త చరిత్ర సృష్టించాడు…
కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షాట్పుట్ ఎఫ్57 విభాగంలో స్వర్ణ పతకం సాధించినందుకు అతనికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది నిస్సందేహంగా అసాధారణ విజయం. రాణా ప్రతిభా ప్రదర్శనతో ఈ విభాగంలో భారత్కు తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. ఈ క్రమంలో ఆద్యంతం అతడు చూపిన పట్టుదల, ఏకాగ్రత, దృఢ సంకల్పం ప్రస్ఫుటమయ్యాయి. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
History made by Soman Rana!
Congratulations to him on clinching the Gold Medal in the Men’s Shot Put F57 event. With this exceptional triumph, he has secured India’s first-ever Commonwealth Gold in this event. His focus and unwavering determination were evident throughout the…
— Narendra Modi (@narendramodi) August 1, 2026
****************
MJPS/SS/ST