పిఎంఇండియా
కామన్వెల్త్ గేమ్స్–2026 మహిళల 54 కేజీల బాక్సింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ప్రీతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రీతి నిలకడైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ ఘనత సాధించిన సందర్భంగా ప్రీతిని అభినందించిన శ్రీ మోదీ, రాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“54 కేజీల మహిళల బాక్సింగ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ప్రీతి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె ఆటతీరు నిలకడగా ఉంది. ఆమెకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా”.
An outstanding performance by Preeti, winning a Gold in the 54 kgs Women Boxing event. Her performance has been consistent. Congratulations to her. Wishing her continued success in the times ahead.#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026