పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించిన శ్రీశంకర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అసాధారణ ప్రతిభతో ఈ పోటీలో రాణించడం ద్వారా ఈ ఘనతను కైవసం చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు.
అథ్లెటిక్స్‌లో శ్రీశంకర్ విజయం దేశంలోని వర్ధమాన క్రీడాకారులలో ఎనలేని ఉత్తేజం నింపుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“శ్రీశంకర్ అద్భుత ప్రతిభకు నిదర్శనం రజతం! అతనిది ఎంతటి అసాధారణ సామర్థ్యం! అత్యుత్తమంగా రాణించడం ద్వారా లాంగ్‌జంప్‌లో పతకం సాధించినందుకు నా అభినందనలు. వర్ధమాన అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఈ విజయం నిస్సందేహంగా ఎనలేని స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులోనూ అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
An outstanding Silver for Sreeshankar! What an exceptional performance!
— Narendra Modi (@narendramodi) July 30, 2026
Congratulations to him on winning the medal and that too with his best leap. His success will motivate several youngsters to pursue excellence in athletics. My best wishes for his upcoming endeavours.…